సూపర్ పాజిటివ్ జేడీ – అందర్నీ పొగుడుతారంతే !

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సోషల్ మీడియాలో అన్ని పార్టీల నేతల్ని పొగిడే కొద్దీ పొగడాలనుకుంటున్నారు. తాజాగా చంద్రబాబునాయుడు విజన్ ను అభినందిస్తూ.. పెద్ద నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు తాజాగా చేసిన సూచనలకు మద్దతిచ్చారు. జేడీ లక్ష్మినారాయణ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. టీడీపీలో చేరుతారా అన్న చర్చ ప్రారంభణయింది. అయితే ఇంతకు ముందే చుక్కల భూముల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని జగన్ నూ ప్రశంసించారు. అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. వైసీపీలో చేరుతారా అని చెప్పుకున్నారు.

అంతకు ముందు స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు బీఆర్ఎస్ చీఫ్ పైనా ప్రశంసలు కురిపించారు. పంట నష్టం ఎకరానికి పదివేలను కేసీఆర్ ప్రకటించగానే పొగిడారు. బీఆర్ఎస్ లో చేరే విషయంలో చర్చలు జరిగాయని అప్పటికే ప్రచారం జరగడంతో ఇక బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అనుకున్నారు.
కానీ అన్ని పార్టీలనూ లక్ష్మినారాయణ పొగుడుతున్నారు కానీ..ఎవర్నీ విమర్శించడం లేదు.

పవన్ కల్యాణ్ సినిమాలు చేయనని చెప్పారని.. పార్టీని వదిలేసి సినిమాలు చేస్తున్నందున తాను జనసేనకు రాజీనామా చేశానని గతంలో ప్రకటించారు.. ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ .. అన్ని పార్టీల నేతల్నీ ఆయన పొగుడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయమని చెబుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం తర్వాత చెబుతానని అంటున్నారు. ఆ పార్టీ ఏదనే దాని కోసమే ఈ ప్రయత్నాలన్న సెటైర్లు సహజంగానే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close