కేసీఆర్ మద్దతు కోసం నేరుగా హైదరాబాద్ వస్తున్న కేజ్రీవాల్ !

ఢిల్లీలో తన అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటున్నా కేసీఆర్ నోరెత్తడం లేదని.. తనకు మద్దతు ఇవ్వాలని అడిగేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేరుగా హైదరాబాద్ వస్తున్నారు. కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్‌కు రాబోతున్నారు. పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరనున్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్‌ ఇప్పటికే బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేలను కలిసి కూడా చర్చించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో కూడా రేపు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ తో సహా బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ ఇప్పటికే ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాయి.

ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ బదిలీల నియామకాలపై తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే ఆ అంశంలో నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతిని కేజ్రీవాల్‌ గుర్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన 8 రోజులకు కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ కి అధికారం కట్టబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.

ఈ ఆర్జినెన్స్ పార్లమెంట్ లో చట్టం అయితే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అని కేజ్రీవాల్ అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. అందుకే అక్కడ పాస్ కావాలంటే ఇతర పార్టీల మద్దతు కావాలి. బీఆర్ఎస్ గతంలో బీజేపీ విషయంలో దూకుడుగా ఉన్నా….ఇటీవల సైలెంట్ అయింది. దీంతో కేజ్రీవాల్ మద్దతు కోసం వస్తున్నారు. కేసీఆర్ .. పార్లమెంట్ లో బిల్లుపై ఓటింగ్ జరిగేటప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close