రాజ‌మౌళి మైండ్‌లో ‘ఈగ 2

రాజ‌మౌళి ఎప్పుడూ సీక్వెల్స్‌పై దృష్టి పెట్ట‌లేదు. కానీ ఈమ‌ధ్య త‌న దృష్టి అటు వైపే వెళ్తోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌కి రెండో భాగం ఉందంటూ ఆమ‌ధ్య ఓ హింట్ ఇచ్చాడు. అయితే దానికంటే ముందు ‘ఈగ 2’ తీస్తాన‌ని చెప్పాడు. ‘ఈగ 2’ గురించి నాని కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. వీలున్న‌ప్పుడ‌ల్లా.. ‘ఈగ 2 ఎప్పుడు సార్‌..’ అంటూ రాజ‌మౌళిని గుర్తు చేస్తూనే ఉన్నాడు. ప్ర‌స్తుతం ఉన్న భారీ, క్రేజీ ప్రాజెక్టుల దృష్ట్యా.. రాజ‌మౌళి ‘ఈగ 2’ గురించి ఆలోచించ‌లేదు. అయితే ఈమ‌ధ్య త‌న మ‌న‌సులో ఈ సీక్వెల్ ఎలా తీస్తే బాగుంటుంద‌న్న ఐడియా వ‌చ్చింద‌ట‌. ఓ టీమ్ తో ఈ క‌థ‌ని ప్ర‌త్యేకంగా రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఈగ అప్ప‌ట్లో ఎలాంటి అంచ‌నాలూ లేకుండా, చిన్న బ‌డ్జెట్ తో విడుద‌లైంది. ఈసారి అలా జ‌రిగే అవ‌కాశ‌మే లేదు. రాజ‌మౌళి చేయి ప‌డితే.. వంద‌ల కోట్లు పెట్టాల్సిందే. అయితే ఈగ 2 మాత్రం ప‌రిమితమైన బ‌డ్జెట్ లో చేయాల‌న్న‌ది రాజ‌మౌళి ప్లాన్‌. మ‌హేష్ బాబు సినిమా పూర్త‌యిన వెంట‌నే.. ఈ సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది. నిజానికి.. మ‌హేష్ బాబు సినిమా ఆల‌స్యం అవుతుంద‌నుకొన్న ప‌క్షంలో ఈగ 2 మొద‌లెట్టి, మహేష్ ఖాళీ అయ్యేట‌ప్ప‌టికి.. పూర్తి చేద్దామ‌నుకొన్నారు. కానీ మ‌హేష్ సినిమా దాదాపుగా రూ.1500 కోట్ల‌తో త‌యార‌య్యే ప్రాజెక్ట్. అందుకే ఆ సినిమాపై పూర్తి స్థాయి ఫోక‌స్ పెట్టాల‌న్న ఉద్దేశంతో ఈగ 2 ని ప‌క్క‌న పెట్టారు. మ‌హేష్ తో సినిమా పూర్త‌యిన త‌ర‌వాత రాజ‌మౌళి చేసే సినిమా దాదాపుగా ఇదే అని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close