టాలీవుడ్ లో కొత్త జోక్‌: మంచు వారి ‘100 కోట్ల‌’ సినిమా

మంచు మోహ‌న్ బాబు, విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాట‌ల్లో కాస్త అతిశ‌యోక్తులు క‌నిపిస్తుంటాయి. దాంతో అన‌వ‌స‌రంగా ట్రోల్ అవుతుంటారు. వీళ్లెప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. మీమ్స్ కి కంటెంట్ ఇచ్చి వెళ్తుంటారు. తాజాగా మోహ‌న్ బాబు కూడా అదే చేశారు. తిరుమ‌ల వెళ్లిన మోహ‌న్ బాబు అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే మంచు విష్ణు ఓ వంద కోట్ల భారీ బ‌డ్జెట్ సినిమా తీయ‌బోతున్నాడ‌ని ప్ర‌క‌టించారు.

విష్ణు సినిమా తీయ‌డంలో త‌ప్పు లేదు. అది హీరోగా, నిర్మాత‌గా ఆయ‌న హ‌క్కు. కాక‌పోతే వంద కోట్లు అని చెప్పుకోవ‌డ‌మే జోక్ గా మారింది. విష్ణు ఓ హిట్ సినిమా తీస్తే.. దాదాపు రూ.20 కోట్లు వ‌సూలు చేస్తోందేమో..? హీరోగా విష్ణు స్టామినా అంతే. అది ఎవ‌రు ఒప్పుకొన్నా, ఒప్పుకోక‌పోయినా న‌మ్మాల్సిన నిజం. ఆమ‌ద్య విష్ణు ‘మోస‌గాళ్లు’ అనే సినిమా తీశాడు. ఈ సినిమాకి ఏకంగా రూ.50 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని, హాలీవుడ్ వెర్ష‌న్ కూడా రెడీ చేశామ‌ని ప్ర‌చారం చేసుకొన్నారు. అయితే తీరా సినిమా విడుద‌ల‌య్యాక అస‌లు క‌థ అర్థ‌మైపోయింది. ఆ సినిమాకి రూ.20 కోట్లు కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని తేలిపోయింది. ‘భ‌క్త‌క‌న్న‌ప్ప‌’ సినిమాని అప్పుడెప్పుడో రీమేక్ చేద్దామ‌నుకొన్నాడు. అప్పట్లో విష్ణు కాస్తో కూస్తో ఫామ్‌లో ఉన్నాడు కూడా. కానీ ఆ సినిమాకి రూ.60 కోట్లు బ‌డ్జెట్ అనేస‌రికి.. వెన‌క‌డుగు వేశాడు. అప్ప‌ట్లో రూ.60 కోట్లు పెట్టి సినిమా తీయ‌లేదు. ఇప్పుడు వంద కోట్లు పెడ‌తారా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. అందుకే మోహ‌న్ బాబు మాట‌లు కామెడీగా తీసుకొంటున్నారు జ‌నాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలుపులు బద్దలు కొట్టి బండారుకు నోటీసులిచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సినిమా స్టైల్ సీన్లు పండించడంలో రాటుదేలిపోతున్నరు. లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపి ఢిల్లీలో షో చేశారు. కానీ నారాయణకు మాత్రం వాట్సాప్‌లో పంపి చేతులు...

ఎవరీ జితేందర్‌ రెడ్డి ?!

ప్రీలుక్ టీజర్ తో క్యురియాసిటీని పెంచింది జితేందర్‌ రెడ్డి. ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే టైటిల్‌ రోల్‌లో...

రాజధాని రైతుల కౌలూ నిలిపివేత – ఉసురు తగలదా !?

రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు. చివరికి కౌలు...

చంద్రబాబుకు గాంధీ మార్గంలో ప్రజల బాసట !

లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి కనీస ఆధారం లేకపోయినా పాతిక రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రజలు గాంధీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close