నాగ‌బాబు చేయాల్సిన క‌థ‌… చిరంజీవితో!

చాలా కాలం క్రితం… వెలిగొండ శ్రీ‌నివాస్ అనే ర‌చ‌యిత ఓ క‌థ రాసుకొన్నాడు. అందులో ఓ నాన్న త‌న కొడుక్కి పెళ్లి చేయాల‌నుకొంటే, కొడుకేమో తండ్రికే పెళ్లి చేయాల‌ని చూస్తుంటాడు. దాదాపుగా ‘మా నాన్న‌కి పెళ్లి’ లాంటి క‌థే ఇది. అప్ప‌ట్లో ఆయ‌న అనుకొన్న హీరోలు నాగ‌బాబు, త‌రుణ్‌. తండ్రి నాగ‌బాబు అయితే, కొడుకు త‌రుణ్ అన్న‌మాట‌. క‌థ కూడా ఓకే అయిపోయి, ప‌ట్టాలెక్కే త‌రుణంలో సినిమా ఆగిపోయింది.

ఇన్నాళ్ల‌కు ఇలాంటి క‌థే ఒక‌టి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ రాసిన `మా నాన్న‌కు పెళ్లి` టైపు క‌థ‌… చిరంజీవికి బాగా న‌చ్చింది. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క‌థ మొద‌ల‌వ్వ‌నుంది. చిరంజీవి హీరో. ఆయ‌న త‌న‌యుడిగా డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తున్నాడు. చిరంజీవి ప‌క్క‌న త్రిష‌నీ, సిద్దూ ప‌క్క‌న శ్రీ‌లీల‌ని హీరోయిన్లుగా ఎంచుకొన్నారు. ఆగ‌స్టులో ఈ సినిమా మొద‌లు కానుంది. అప్ప‌ట్లో నాగ‌బాబు కోసం అనుకొన్న పాయింట్ ఇదే కావొచ్చు. కానీ… ట్రీట్మెంట్ మాత్రం చిరు స్థాయికీ, ఆయ‌న ఇమేజ్‌కీ తగ్గ‌ట్టుగా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లెద్దు. అయితే.. వెలిగొండ శ్రీ‌నివాస్ రాసుకొన్న క‌థ‌కీ, ఇప్పుడు ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ రాసిన క‌థ‌కూ ఏమైనా లింకు ఉందా అనేదే డౌటు. దీనికి ఆ ఇద్ద‌రు ర‌చయిత‌లే స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close