వివేకా హత్య కేసు : దర్యాప్తు కొనసాగిస్తే చేరేది జగన్ దగ్గరికే !?

వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీటులో ఉన్న అంశాలు సంచలనాత్మకంగా మారాయి. ఎలా చంపారు.. ఎందుకు చంపారు.. అన్నది పూర్తి స్థాయిలో సాంకేతిక ఆధారాలతో చార్జిషీటులో పెట్టారు. ఆధారాలేమీ లేవని కేవలం దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే కేసులు పెట్టారని వాదిస్తున్న వారికి ఈ చార్జిషీటుతో షాక్ కొట్టినట్లయింది. అయితే అసలు లోతుగా పరిశీలిస్తే.. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తే.. నేరుగా జగన్ దంపతుల వద్దకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని నేర పరిశోధనలో నిపుణులైన వారు అంచనాలు వేస్తున్నారు.

అందరి కంటే ముందు భారతి, జగన్‌ దంపతులకు తెలుసు

వివేకా హత్య జరిగిన రోజున మొదట చూసిన వ్యక్తి పీఏ కృష్ణారెడ్డి. అది ఆరున్నర గంటల సమయంలో. కానీ అంతకు ముందే హత్య చేసిన వాళ్లు ఈ సమాచారాన్ని తెలిసిన వారికి పంచుకున్నారు. జగన్ రెడ్డికి ఐదుగంటలకే తెలుసని ఆ రోజున జగన్ ఇంట్లో మీటింగ్‌లో ఉన్న అజేయకల్లాం సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే వీరిద్దరూ చెప్పిన సమయాల్లో తేడా ఉంది…కానీ అది అసలు హత్య గురించి బ యటకు తెలియక ముందే. సీబీఐ దర్యాప్తు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది.

జగన్‌, భారతిలకు ముందే తెలుసంటున్న సీబీఐ

గతంలోనూ జగన్, భారతిల ప్రస్తావన సీబీఐ తీసుకు వచ్చింది. కోర్టులో దాకలు చేసిన పలు కౌంటర్లలో వివేకా హత్య గురించి వారికి ముందే తెలుసని.. వారికి ఎలా తెలిసిందో తెలుసుకోవాల్సి ఉందని కూడా చెప్పింది. కానీ దర్యాప్తు ప్రస్తుతానికి అక్కడకు వచ్చింది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు దర్యాప్తు కోసం ఇచ్చిన గడువు ముగిసింది. సుప్రీంకోర్టు.. కేసు ఫైల్స్ అన్నింటినీ.. కేసు డైరీని కూడా సీల్డ్ కవర్‌లో అందించాలని ఆదేసించింది ఈ అంశంపై తదుపరి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

షర్మిల వాంగ్మూలం ..సూటిగా.. సుత్తి లేకుండా !

అవినాష్ రెడ్డికి సీటు దక్కకుండా తనను పోటీ చేసేలా వివేకా ఒప్పించారని షర్మిల చెప్పారు. కానీ జగన్ మాత్రం ఒప్పుకోలేదని .. ఈ విషయంలోనూ చాలా వివాదాలొచ్చాయని షర్మిల చెబుున్నారు. షర్మిల కుటుంబంలో జరిగిన అన్ని విషయాల గురించి విడమర్చి చెప్పారు. గొడవలు ఉన్నాయన్నారు. షర్మిల సాక్ష్యం ప్రకారం చూస్తే.. ఆమెకు సీటు ఇచ్చేందుకు జగన్ రెడ్డి కూడా నిరాకరించారు. కానీ షర్మిలకు సీటివ్వాల్సిందేనని.. వివేకా ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో హత్య జరిగింది.

వివేకా హత్య కేసులో సూత్రధారుల్ని కూడా పట్టుకుంటే .. సీబీఐ ప్రతిష్ట మసకబారకుండా ఉంటుంది. లేకపోతే.. దేశంలో బలవంతులు ఎలాంటి నేరాన్నైనా చేసి తప్పించుకోవచ్చన్న అభిప్రాయానికి ప్రజలు వస్తారు. అది దేశ నేరపరిశోధనా.. న్యాయవ్యవస్థల బలహీనానికి దారి తీస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close