నిజమే .. వైసీపీ వచ్చిన మూడేళ్లలో 30 వేలమంది మహిళల మిస్సింగ్!

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిన మాట నిజమేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనే ఈ అంశాన్ని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో 2186 మంది బాలికలు మిస్సయ్యారు. అంటే 18ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని బాలికల కేటగరిలో చేరుస్తారు. 6252 మంది మహిళలు మిస్సయ్యారు. అలాగే 2020లో 2374 మంది బాలికలు, 7057 మంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. 2021లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 3358 మంది బాలికలు .. 8969 మంది మహిళలు కనిపించకండా పోయారు. మొత్తంగా వీరి సంఖ్య 30196 మంది. వీరిలో కొంత మంది ఆచూకీ తర్వతా తెలిసిందని కేంద్ర హోంశాఖ చెబుతోంది.

దేశం మొత్తం మీద మూడున్నర లక్షల మందికిపైగా చిన్నారులు, మహిళలు మిస్సింగ్ అయినట్లుగా కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. మహిళల మిస్సింగ్ అంశం రాజకీయంగా ఏపీలో దుమారం రేపడంతో అసలైన డేటా ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే ముఫ్పై వేల మంది మిస్సయ్యారని తేలడంతో ఈ అంశం మరోసారి రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.

మహిళల మిస్సింగ్‌కు… హ్యూమన్ ట్రాఫికింగ్‌కు సంబంధం లేదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ మిస్సింగ్‌లకు వాలంటీర్లకు సంబంధం లేదని.. వాలంటీర్లు లేని చోట్ల కూడా పెద్ద ఎత్తున మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. అయితే మహానగరాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. పెద్ద సిటీలు లేని రాష్ట్రాల్లో ఏపీలోనే అత్యధికంగా మహిళలు కనిపించకుండా పోతున్నారు. దీన్నే పవన్ ప్రశ్నిస్తున్నారు. ఈ మిస్టరీ ఏమిటో బయటకు వస్తుందా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close