ఇంతింతై … జన సునామీగా మారుతున్న యువగళం !

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర ఊహించని ప్రజాదరణతో సాగుతోంది. నియోజవర్గంలో ఓటర్లలో సగం మంది లోకేష్ పాదయాత్రకు తరలి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అద్దంకిలో అది కనిపించింది. కుప్పంలో ప్రారంభమైనప్పుడు … లోకేష్ పై చాలా మంది వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ , పోలీసులు ఆటంకాలు, వైసీపీ సోషల్ మీడియా ప్రచారాలు చేసి … పాదయాత్ర ఎప్పుడైనా ఆపేస్తారేమోనన్న అనుమానం కూడా కల్పించారు. జనం లేనే లేరనే ప్రచారాల సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పాదయాత్ర జరుగుతున్న విధానం చూసి.. కామెంట్లు చేసిన వారంతా నాలిక్కరుచుకుంటున్నారు.

లోకేష్ పాదయాత్ర సందర్భంగా సెల్ఫీల కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి… కనీసం వెయ్యి మంది క్యూలో ఉంటున్నారంటే అది చిన్న క్రేజ్ కాదు. పైగా అంత సేపు ఓపికగా సెల్ఫీలు ఇవ్వడం అంటే. .. యువనేత సహనానికి సాక్ష్యంగా మారింది. పక్కా స్ట్రాటజీలతో … వ్యూహాత్మకంగా పాదయాత్ర చేస్తున్నారు. అన్ని వర్గాలను కలిసేందుకు వారికి భ రోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలు లోకేష్ పాదయాత్రను సీరియస్ గా తీసుకున్నారు. నిజానికి లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదు.. సీఎం అభ్యర్థి కాదు. అయినా సరే.. ఆయన పాదయాత్రకు ఈ రేంజ్ లో స్పందన రావడం టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.

స్టాన్ ఫర్డ్ లోకేష్… నీట్ షేవ్ లోకేష్ ను చూపించి.. బాగా చదువుకున్నోడు.. ఏపీ రాజకీయాల్లో ఇమడలేడు.. ఇక్కడంతా రౌడీయిజమే నడుస్తుందన్న అభిప్రాయాన్ని కొంత మార్చారు.. తాను కొంత మారాడు. లోకేష్ వేషభాషలు మారాయి. మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. ఆయనకు ఉన్న సబ్జెక్ట్ గురించి అందరికీ స్పష్టత వచ్చింది. జగన్ రెడ్డికి .. కనీసం నమస్కారం అనే మాట కూడా సొంతంగా చెప్పలేని పరిస్థితి వచ్చింది. కానీ లోకేష్ .. లోతైనా సబ్జెక్ట్స్ నుంచి చూడకుండా మాట్లాడుతున్నారు. అందరికీ వివరణ ఇస్తున్నారు. ఆయన కు విషయ పరిజ్ఞానం సామాన్యులను ఆశ్చర్య పరుస్తోంది. కాలానికి తగ్గట్లుగా మారే నాయకుడ్ని చూస్తున్నారు.

వైసీపీ నేతలకు మాటలతో సమాధానం ఇస్తున్నారు. రాజకీయ వ్యూహాల ప్రకారం స్పందిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో … ఓటర్లు ఓట్లేసిన మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీ విజయం సాధించారు. ఆ ఉత్సాహంతో.. యువగళం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ముందు ముందు చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రల్లో ఒకటిగా మిగిలే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close