క్రిమినల్ మైండ్ ఉన్న వారికి నేరం చేయాలన్న ఆలోచన వస్తే ఎన్ని రకాల కుట్రలు పన్నుతారో.. కొన్ని కొన్ని ఘటనల్లో వెలుగు చూసే మాస్టర్ ప్లాన్లే రుజువులుగా ఉంటాయి. లండన్లో ఉన్న ఓ భర్త.. తన భార్యతో విబేధాల కారణంగా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె కుటుంబం మొత్తాన్ని చంపాలనుకున్నాడు. అక్కడ్నుంచే స్కెచ్ వేశాడు. నాటు పద్దతిలో కత్తులతో చంపడం.. కాల్చి చంపడం వంటివి కాకుండా సింపుల్గా ఇంట్లో శాంపిల్ అంటూ నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను పంపి మర్డర్లకు స్కెచ్ వేశారు. కానీ చివరికి బయటపడిపోయాడు.
లండన్లో నివాసం – హైదరాబాద్ లో మర్డర్ స్కెచ్
హైదరాబాద్కు చెందిన అజిత్ కుమార్ లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు, 2018లో డాక్టర్ అయిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ లండన్లో స్థిరపడ్డారు . అయితే పాప పుట్టాక ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయి. లండన్ లోనే విడివిడిగా ఉంటూ వచ్చారు. తన సోదరుడి పెళ్లి ఉండటంతో శిరీష ఇండియాకు వచ్చారు. దీంతో అజిత్ కుమార్ ఇండియాలో భార్యతో సహా కుటుంబం మొత్తాన్ని చంపడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇందు కోసం తెలిసిన వాళ్లతో ముందుగా భార్య అపార్టుమెంట్ వాచ్ మెన్ కుమారుడ్ని.. అదే అపార్టుమెంట్ లో నివాసం ఉండే మరో వ్యక్తిని మంచి చేసుకుని ప్లాన్ అమలు చేశాడు.
శాంపిల్ పొడులంటూ విషంతో నింపినవి పంపిణీ !
అపార్టుమెంట్ లో పెట్టుకున్న వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని … వివిధ రకాల పద్దతుల్లో వారిని చంపేందుకు ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. వారు మొదట… వ్యాక్సిన్ పేరిట కుటుంబసభ్యులందరికీ విషమిచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. దీంతో . . తర్వాత కారం, ఇతర పొడుల ప్యాకెట్లలో విషం కలిపి… శాంపిల్ ప్యాకెట్లని పంపిణీ చేశారు. నిజమేనని ఉపయోగిచిన శిరీష కుటుంబం అస్వస్థతకు గురైంది. వయసులో పెద్ద అయిన బామ్మ చనిపోయారు. ఆమె చనిపోవడం అందరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో… టెస్టుల్లో అసలు విషయం బయటపడింది. విష ప్రయోగం జరిగినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులకే మైండ్ బ్లాంక్ అయిన స్కెచ్
లండన్ లో కూర్చుని ఇక్కడ కొంత మందిని పెట్టుకుని భార్య కుటుంబంపై అజిత్ కుమార్ చేయించిన మర్డర్ ప్లాన్ పోలీసులకే మైండ్ బ్లాంక్ చేయించింది. వెంటనే ఇందులో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేశారు. లండన్ లో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుటుంబంలో గొడవలు వస్తే సర్దుకుపోవాలి.. సర్దుకుపోలేకపోతే విడిపోయి ఎవరి బతుకు వారు బతకాలి అంతే కానీ మరో భాగస్వామి బతకకూడదు.. వారి కుటుంబం ఉండకూడదు అని ఆలోచిస్తే… మొత్తం రెండు వైపులా కుటుంబు నాశనం అయిపోతాయి. ఈ కేసులో అదే జరుగుతోంది..