ఆర్కే పలుకు : రామోజీ వెంట్రుక కూడా జగన్ పీకలేరు !

ఓ పథకం బటన్ నొక్కే ప్రసంగంలో నా బొచ్చు కూడా పీకలేరు అని జగన్ రెడ్డి డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆర్కే.. అలాంటి భాష నేరుగా వాడలేదు కానీ.. రామోజీ వెంట్రుక కూడా జగన్ పీకలేరు అని కొత్త పలుకు ద్వారా తేల్చేశారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎంత ప్రమాదకరమైన రాజకీయ ఆట ఆడుతున్నారో చెప్పేందుకు ఈ వారం వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు వివరించారు. ఇలా చెప్పడం ఆయనకు సలహాలివ్వడం అవుతుంది కాబట్టి… పరోక్ష పద్దతిలో చెప్పారు. రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలనుకుంటే… ఆ అధికారం మారితే ఏమవుతుంది అనే ఓ ప్రశ్నను జగన్ రెడ్డికి వదిలారు. భారతి సిమెంట్ మూసి వేత తప్పదని చెప్పారు. భారతీ సిమెంట్ పై లెక్కలేనన్ని కాలుష్య ఆరోపణలు ఉన్నాయి. నివేదికలూ ఉన్నాయి. లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల్ని ఎలా మూయించారో దారి చూపించింది. అ ప్రకారం… జగన్ రెడ్డి అధికారం పోయిన మరుక్షణం ఆయనకు చెందిన వ్యాపార సంస్థలు మనుగడ సాగించడం కష్టమే.

భారతి సిమెంట్ కు … ఒక్క ప్లాంటే ఉంది. బయట ఎక్కడా మరో ప్లాంట్ లేదు. అది వికాట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా అమ్మారు కానీ.. అతి ఉత్తుత్తికే అని కార్పొరేట్ వర్గాలకు తెలుసు. ఆ కంపెనీ తరపున పేరుకే డైరక్టర్లు ఉంటారు… నిర్వహణ.. లాభాలు.. వ్యాపారాలు మొత్తం జగన్ రెడ్డి కుటుంబ కనుసన్నల్లో ఉంటాయి. మామూలుగా మెజార్టీ వాటా ఉన్న వాళ్లు ఆ సంస్థను స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదంటేనే ఎంత గోల్ మాల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కార్మికులకు వేతనాలు దగ్గర్నుంచి కాలుష్య నిబంధనలు పాటించడం వరకూ చాలా లోపాలున్నాయి.

ఒక్క భారతీ సిమెంట్ మాత్రమే కాదు… జగన్ రెడ్డి ఆర్థిక మూలాలు ఏపీలో ఎక్కువే ఉన్నాయి. అవి బయట ప్రపంచానికి తెలియవు కానీ… రాజకీయవర్గాలకు బాగా తెలుసు. వాటిని ఎలా దెబ్బకొట్టాలో అలా కొడతారు. కొట్టకపోతే చేతకానితనం అనుకుంటారు. ఇక జగన్ రెడ్డి చూపించిన బాటలోనే… ఆ పార్టీ ముఖ్య నేతల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటారు. వ్యాపారవేత్తలకు రాజకీయం అనేది.. తమ వ్యాపారాలకు అదనపు బలమే కానీ.. రాజకీయం కోసం తాము దివాలా తీయాలని అనుకోరు.. రాంకీ రెడ్డి అయినా… రియల్ ఎస్టేట్ వేమిరెడ్డి అయినా ఇదే చేస్తారు. వాళ్లకు ఆర్థికంగా నష్టం అయితే వెంటనే జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పేస్తారు. ఇవన్నీ గుర్తుకు వచ్చేలా ఆర్కే తన తన కొత్తపలుకులను వివరించారు. ఇలా చెప్పడానికి .. మార్గదర్శిపై ప్రభుత్వం జరుపుతున్న ఏకపక్ష దాడుల్ని వాహకంగా ఉపయోగించుకున్నారు. అంతే కాదు.. రామోజీరావు కాలిగోటిని కూడా తాకలేరని తేల్చేశారు.

ఇక కేసీఆర్ పైనా … ఆర్కేకు కోపం వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలకూ ఆహ్వానాలు లేకపోవడంతో… దొరల పాలన ఇలాగే ఉండేదంటూ పలు కారణాలు చూపించారు. ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి మద్దతుగా ఉండేందుకు ఆర్కే కేసీఆర్ ను వ్యతిరేకించేవారని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అక్కడ టీడీపీ లేదు. అయినా జర్నలిజం ప్రమాణాలను పాటిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆర్కే నిఖార్సైన జర్నలిస్టుగా తన ఇమేజ్ నిలుపుకుంటూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close