బాలీవుడ్ ఎంట్రీ గురించి చెప్పిన మెగా హీరో

మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ దారి వేరు. మాస్ సినిమాల‌కంటే… కంటెంట్ బేస్డ్ క‌థ‌ల‌కే పెద్ద పీట వేస్తాడు వ‌రుణ్‌. అందుకే త‌న ద‌గ్గ‌ర్నుంచి కంచె, అంత‌రిక్షం లాంటి క‌థ‌లొచ్చాయి. మాస్ క‌థ‌ల‌కూ తాను ప‌ర్‌ఫెక్ట్ గా సరిపోతాడు. బాలీవుడ్ హీరోల‌కుండే ఫీచ‌ర్స్ వ‌రుణ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా మార్కెట్ విస్కృత‌మ‌వుతున్న ఈ ద‌శ‌లో వ‌రుణ్ బాలీవుడ్ సినిమా చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. కానీ వ‌రుణ్ ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదు. బాలీవుడ్ లో సినిమా చేయాలి కాబ‌ట్టి, ప‌నిగ‌ట్టుకొని సినిమా చేయ‌కూడ‌ద‌ని, కంటెంటే బాలీవుడ్ కి తీసుకెళ్లాల‌ని చెబుతున్నాడు వ‌రుణ్‌. త‌న కొత్త సినిమా `ఆప‌రేష‌న్ వాలెంటైన్` త‌న తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ అవ్వ‌బోతోంద‌న్న హింట్ ఇచ్చాడు.

గాండీవ‌ధారి అర్జున త‌ర‌వాత వ‌రుణ్ నుంచి రాబోతున్న సినిమా ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్‌’. ఇదో యాక్ష‌న్ బేస్డ్ డ్రామా. ఈ సినిమాని హిందీలో సైతం విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో సినిమా తీసి, ఆ త‌ర‌వాత హిందీలో డ‌బ్ చేసి ‘మమ‌..’ అనిపించ‌డం వ‌రుణ్‌కి ఇష్టం లేదు. అందుకే తెలుగులోనూ, హిందీలోనూ రెండు వెర్ష‌న్ల‌లో ఈసినిమా తీశారు. వ‌రుణ్ కూడా హిందీ నేర్చుకొని మ‌రీ… సెట్లో డైలాగులు చెప్పాడ‌ట‌. ”నాకు బేసిగ్గా హిందీ రాదు. అందుకే ఈ సినిమా కోసం మూడు నెల‌లు క‌ష్ట‌ప‌డి హిందీ నేర్చుకొన్నా. సెట్లో ప్రామ్టింగ్ లేకుండా నా డైలాగులు నేనే చెప్పా. డ‌బ్బింగ్ కూడా చెప్పాల‌ని ఆశ‌గా ఉంది” అని చెప్పుకొచ్చాడు వ‌రుణ్‌. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. ఈ డిసెంబ‌రులో విడుద‌ల కానుంది. సో… అఫీషియ‌ల్ గా వ‌రుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఖ‌రారైంద‌న్న మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

పోటీ నుంచి త‌ప్పుకొన్న కాజ‌ల్‌

అదేంటో... అంద‌రి దృష్టీ ఈనెల 31 మీదే ప‌డింది. ఆ రోజున 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గం గం గ‌ణేశా', 'భ‌జే వాయు వేగం', 'స‌త్య‌భామ‌', 'హ‌రోం హ‌ర‌' సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఏబీపీపై మళ్లీ హైకోర్టుకు జగన్ సర్కార్

ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైరయ్యే లోపు పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ రెడ్డి సర్కార్ సిద్దపడటం లేదు. తప్పుడు సస్పెన్షన్లతో సుప్రీంకోర్టు తీర్పును సైతం ధిక్కరించారని క్యాట్ తీర్పు చెపితే.. ఆ తీర్పు మీద మళ్లీ...

విశాఖ వర్సెస్ అమరావతి… ఉత్కంఠపోరులో గెలుపెవరిది..?

ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజధాని భవితవ్యం ఆధారపడి ఉంది. ఫ్యాన్ గాలి వీస్తే విశాఖ వేదికగా పరిపాలన సాగడం ఖాయం. సైకిల్ పరుగులు పెడితే మాత్రం అమరావతి క్యాపిటల్ సిటీ అవ్వడం పక్కా....

HOT NEWS

css.php
[X] Close
[X] Close