అప్రూవర్‌గా మారిన బినామీ పిళ్లై – మోదీపై పొగడ్తలందుకున్న కవిత !

కల్వకుంట్ల కవిత కొత్తగా గాంధీ కుటుంబాన్ని దూషించడం ప్రారంభించారు. రాహుల్ గాంధీ అప్ డేట్స్ లేని అవుట్ డేటెడ్ నాయకుడని .. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని విమర్శిస్తున్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ఆపలేకపోతున్నారు కాబట్టే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అయ్యిందన్నారు. జగిత్యాల పార్టీ మీటింగ్‌లో కవిత ప్రసంగం మొత్తం కాంగ్రెస్ నే టార్గెట్ చేసుకున్నారు. పనిలో పనిగా మోదీపై ప్రశంసలు కురిపించారు.

హఠాత్తుగా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తే.. మోదీని కవిత ఆహా..ఓహో అని ఎదుకు అంటున్నారన్న అనుమానం చాలా మందికి వస్తోంది. కవిత మాటలు విన్న వారికి ఏదో తేడాగా ఉందే అనిపించక మానదు. నిజంగానే తేడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కాం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్రన్ పిళ్లై అప్రూవర్ గా మారి.. ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరంచారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు.

ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం పరిణామాలు వేగంగా మారుతూండటంతో.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కవిత.. స్వరం మార్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close