మార్గదర్శి కేసుకు మించి కామెడీ చేస్తున్న సీఐడీ చీఫ్ !

సీఐడీ చీఫ్ సంజయ్ ఐపీఎస్ చదువుకున్నారో లేదో కానీ.. సజ్జల ఇచ్చే తప్పుడు కేసుల కుట్ర ధియరీలను మీడియా ముందు చదివే ముందు తన పరువు ఉంటుందా పోతుందా అనేది ఆలోచించకోవడం లేదు. సజ్జల రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిన తర్వాత ఈ సీఐడీ చీఫ్ సంజయ్ బరిలోకి దిగారు. కోర్టులో కౌంటర్ వేయకుండా.. రెండు వారాల సమయం కావాలని నంగినంగిగా విజ్ఞప్తి చేసి…బయటకు వచ్చి మీడియా ముందు చెప్పిందే చెప్పి చావదొబ్బుతున్నారు. జీవోకు.. ఎంవోయూకు పొంతన లేదంటారు.

అది ఎలా నేరం.. నేరం అయితే చంద్రబాబుకేం సంబంధం.. వాటిని ప్రిపేర్ చేసేది చంద్రబాబా ?. ఎండీ, కార్యదర్శి కాదా ?. డబ్బులు షెల్ కంపెనీలకు వెళ్లాయంటారు.. అసలు షెల్ కంపెనీల సంగతి తర్వాత.. ముందు డిజైన్ టెక్ వాళ్లు తమ డబ్బులకు మొత్తం.. ఎక్విప్ మెంట్ ఇచ్చాం.. ఖర్చు కూడా ఇదిగో అని బిల్లులతో సహా సీఐడీకి పంపించారు. ఆ వివరాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. మొత్తం సరుకు అందిన తర్వాత ఇక స్కాం ఎక్కడ ఉందన్నది చెప్పాల్సింది.. డబ్బులు షెల్ కంపెనీలకు వెళ్లాయి అనే వాదన వినిపిస్తారు. ఓ గ్రాఫ్ చూపిస్తారు. అసలు వాటికి చంద్రబాబుకు సంబంధం ఏమిటనేది చెప్పరు. గంటా సుబ్బారావును తెచ్చి మూడు పదవులు ఇచ్చారని మరోసారి నీలుగుతారు.

నిబంధల ప్రకారమే అక్కడ నియామకాలు జరగలేదని మాత్రం చెప్పరు. సీఐడీ చీఫ్ పూర్తిగా ఐపీఎస్ చదివినట్లుగా కాకుండా… మత సమావేశాలు పాటలు పాడుకున్నట్లుగా బట్టి పట్టినట్లుగా వచ్చి మాట్లాడుతూండటం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. చంద్రబాబును అక్రమంగా.. అడ్డగోలుగా అరెస్ట్ చేసింది కాకండా.. ఒక్క సాక్ష్యం ఆయనకు వ్యతిరేకంగా చూపించకుండా… షెల్ కంపెనీలు.. నిధుల మళ్లింపు.. దుర్వినియోగం అంటూ కట్టుకథలు చెబుతున్నారు. ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదని కళ్ల ముందు లెక్కలు ఉన్నా.. అదే బుకాయింపు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నామన్న ధైర్యమేమో కానీ చెప్పిందే చెప్పి .. అందరూ ప్రజల బుర్రను మాత్రం తినేస్తున్నారు.

అసలు ఈ కేసులో ఏమైనా నిబంధనల ఉల్లంఘన అంటూ జరిగితే.. అది ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు… ఎండీ , కార్యదర్శిలది కాదా అనేది మొదటి ప్రశ్న. దీనికి సీఐడీ ఎప్పుడూ సమాధానం చెప్పరు. మొత్తంగా ప్రజల ముందు సీఐడీ విభాగాన్ని… వైసీపీ అనుబంధ సంస్థగా మార్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close