ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా భారీతారాగణం వుంది. ఇప్పటికే టీజర్ ఒకటి వదిలారు. పండక్కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఐతే ఇటివలే ఈ సినిమా పుటేజ్ ని కొంత లీక్ అయ్యిందని, వైజయంతీ మూవీస్ సదరు కంపెనీ పై నష్టపరిహారం కేసుని వేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా నిర్మాణ సంస్థ నుంచి పబ్లిక్ కి లీగల్ ఎలర్ట్ ఒకటి ఇచ్చారు. దీనికి ప్రకారం… ఈ సినిమాలో సర్వ హక్కులు వైజయంతీ మూవీస్ కి వున్నాయి. సినిమాలోని ఏదైనా సీన్స్ ని విజువల్స్ ని, ఫుటేజ్, స్టిల్స్ ని సంస్థ కాకుండా ఎవరైనా షేర్ చేయడం చట్టవిరుద్ధం. అలా పంచుకుంటే కాపీ రైట్ యాక్ట్ కింద శిక్ష కూడా పడుతుంది. సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

ఇది నిర్మాణ సంస్థ పబ్లిక్ కి ఇచ్చిన నోటీస్. ఈ నోటీస్ లో మరో పాయింట్ కూడా వుంది. ఈ సినిమాకి సంబధించి నిర్మాణ సంస్థ కాకుండా, ఎవరైనా అప్డేట్స్ ఇచ్చినా, గాసిప్స్ రాసిన శిక్షలు వుంటాయి. మొత్తానికి నిర్మాణ సంస్థ తప్పా ఈ సినిమా గురించి ఎవరూ ఏమీ రాయకూడదు, మాట్లాడకూడదు, ఏం షేర్ చేయకూడదు. అది మేటరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close