సోమవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ల విచారణ !

చంద్రబాబు దాఖలు చేసుకున్న ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుందో లేదో స్పష్టత లేదు. కానీ లిస్టులో మాత్రం ఉంటోంది. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది.. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడంతో న్యాయమూర్తుల రోస్టర్ మారుస్తూ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్వాష్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాసరెడ్డి, బెయిల్ పిటిషన్లను సురేష్ రెడ్డి విచారించేవారు. ఇప్పుడు రోస్టర్ మారింది.

క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు రెండూ ఈ ఇద్దరు న్యాయమూర్తుల వద్దకు కాకుండా రోస్టర్‌లో వేరే కేసులను కేటాయంచారు. బెయిల్ పిటిషన్లను జస్టిస్ టి. మల్లిఖార్జునరావు బెంచ్ విచారణ జరపనుంది. అలాగే క్వాష్ పిటిషన్ల బెంచ్ కూడా మారింది. హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లపై వాయిదాలు పడ్డాయి. తర్వాత విచారణ వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ అన్నారు. దీంతో చంద్రబాబు కేసుల్లో అసలేం జరుగుతోందన్న చర్చ రాష్ట్రంలో ప్రారంభమయింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. ఆక్వాష్ పిటిషన్ కు బెయిల్ పిటిషన్ సంబంధం లేదు. అయినా హైకోర్టులో విచారణలు ముందుకు సాగడం లేదు. సోమవారం కూడా విచారణ జరుగుతుందా లేకపోతే వాయిదాలు పడతాయా అన్నది సస్పెన్స్ గానే ఉంది. ప్రభుత్వ లాయర్లు ఉద్దేశపూర్వకంగా వాయిదాలు అడుగుతూండటంతో ఈ సారి అదే చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close