జీతేర‌హో ఇండియా: ఈసారి బౌల‌ర్ల వంతు

ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వ‌రుస‌గా 6వ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకొంది టీమ్ ఇండియా. అయితే ఈసారి మ్యాచ్‌ని బౌల‌ర్లు గెలిపించారు. 230 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త జ‌ట్టు కాపాడుకోవ‌డం, వంద ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకోవ‌డం నిజంగా.. అద్భుత‌మే. బౌల‌ర్ల‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై… బూమ్రా, ష‌మీ, కుల‌దీప్ చెల‌రేగిపోయారు. ప్ర‌పంచ ఛాంపియ‌న్‌ని మ‌ట్టి క‌రిపించారు. ఈఓట‌మితో.. ఇంగ్లండ్ ఇంటికి వెళ్ల‌డంతో పాటుగా మ‌నం సెమీస్‌కి ద‌ర్జాగా అడుగుపెట్ట‌డం కూడా ఖాయ‌మైపోయాయి. అయితే ఇలాంటి పిచ్‌పై కూడా రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ చేసిన విధానాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎప్పుడూ దూకుడుగా ఆడే రోహిత్.. ఈ సారి సంయ‌మ‌నంతో బ్యాటింగ్ చేశాడు.తృటిలో సెంచ‌రీ (87) కోల్పోయినా… సెంచ‌రీ కంటే గొప్ప ఇన్నింగ్స్ ఇది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుత‌మైన ఫామ్ లో ఉన్న ఇండియ‌న్ కెప్టెన్‌.. మ‌రోసారి సూప‌ర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి (0) నిరాశ ప‌రిచినా, రాహుల్‌, సూర్య కుమార్ త‌ప్ప మిగిలిన వాళ్లెవ్వరూ రాణించ‌లేక‌పోయినా, ప్ర‌తి కూల ప‌రిస్థితుల్లో జ‌ట్టు స్కోరు 200 దాటించాడు. చివ‌ర్లో బూమ్రా, కుల‌దీప్ జోడించిన విలువైన ప‌రుగుల్ని మ‌ర్చిపోకూడ‌దు. మొత్తానికి ఈ వ‌రల్డ్ క‌ప్ లో భార‌త్ త‌న చైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. సెమీస్ లో కూడా ఇదేర‌క‌మైన ఆట తీరు ప్ర‌ద‌ర్శిస్తే.. క‌ప్ మ‌న‌దే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close