ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు నో బెయిల్

రూ. 338 కోట్ల రూపాయల లావాదేవీలపై ఆధారాలను ఈడీ సమర్పించినందున ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ పై గతంలోనే విచారణ పూర్తయింది. ఇవాళ తీర్పు వెలువరించింది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న కేసులపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, సిసోడియాపై ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో సీబీఐ, ఈడీలకు పలు ప్రశ్నలు సంధించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిసోడియా ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో వాదనలు వినింది. తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. తనపై రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోరారు. సిసోడియాపై విచారణను ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ ప్రక్రియ మందకొడిగా కొనసాగితే సిసోడియా మూడు నెలల్లోగా మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా మందిని ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది. సౌత్ లాబీ నుంచి చాలా మందిని అరెస్టు చేశారు. మనీ రూటింగ్ జరిగిందని చార్జిషీట్లలో పేర్కొన్నారు. అయితే దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. ఒక్క కవిత మాత్రమే బయట ఉన్నారు. ఆమెపై విచారణను నవంబర్ వరకూ సుప్రీంకోర్టు ఆపేసింది. ముందు ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close