చిన్న కాంట్రాక్టర్లను చిదిమేసిన జగన్ రెడ్డి !

ప్రభుత్వం అంటే.. ఎవరికైనా ఓ నమ్మకం. ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తే లీడర్లు, అధికారులకు లంచాలిచ్చి అయినా పదో పరకో వెనకేసుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు అసలు బాబోయ్ ప్రభుత్వ పనులా అని కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. వారికి పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ లో ఉండటంతో వారెవరూ పనులు చేయడం లేదు. ప్రభుత్వానికీ అదే కావాలి. ఎందుకంటే పనులేమీ చేయించడం లేదు కాబట్టి పట్టించుకోవడం లేదు. పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వడంలేదు.

ముఖ్యంగా ప్రభుత్వానికి అవసరమైన రోజువారీ పనులు చేసే కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్ల రూపాయలకుపై బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరికీ బిల్లులు మంజూరు చేయడం లేదు. ఇరవై శాతం కమిషన్ తీసుకుని అయినా మా డబ్బులు మాకిప్పించండయ్యా అని వారంతా నేతల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వారంతా ఉద్యమ బాట పట్టారు. ధర్నాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు వాపోతున్నారు.

నిజానికిు గతంలో ఇలాంటి కాంట్రాక్టర్లు ప్రభుత్వం డబ్బులివ్వకపోతే హైకోర్టుకు వెళ్లేవారు. హైకోర్టు న్యాయం చేసేది. ఇటీవలి కాలంలో హైకోర్టులో కూడా వారికి ఊరట లభించడం లేదు. హైకోర్టులో విచారణకు రావడం తగ్గిపోయింది. విచారణ వచ్చిన పిటిషన్లకు ప్రభుత్వం.. జీవో ఇచ్చాం… సీఎఫ్ఎంఎస్‌లో పెట్టాం.. బటన్ నొక్కాం అంటూ కబుర్లు చెప్పి వాయిదాలేస్తోంది. చివరికి డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా… పట్టించుకునే దిక్కూ దివాణం లేకుండా పోయింది.

ఏపీలో వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయినట్లుగా కనిపిస్తోంది. నిజంగా డబ్బులు లేవా… అంటే అలాంటి సమస్య లేదు. ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం కాక 90వేల కోట్ల అప్పును జగన్ రెడ్డి సర్కార్ చేసింది. అభివృద్ధి కోసం చేసిన ఖర్చేమీ లేదు. పథకాలన్నీపెండింగ్ లో ఉన్నాయి. రైతు భరోసా బటన్ నొక్కితే… ఒక్కో రైతు ఖాతాలో పడాల్సిన రెండు వేలు కూడా వారమైనా పడలేదు. మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయంటే… అస్మదీయులైన బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లింపులు చేస్తున్నారు. గత రెండు నెలల్లోనే పది వేల కోట్లు చెల్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాళ్లందర్నీ మళ్లీ సాక్షిలోకి తీసుకోవట్లేదు !

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో సాక్షిలో పని చేసిన వాళ్లే ఎక్కువగా చేరారు. ఫోటో గ్రాఫర్ల దగ్గర నుంచి సలహాదారు, పీఆర్వోల వరకూ అందరూ సాక్షిలో...

ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్ పై కసరత్తు

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ హామీని...

కొడాలి నాని ఇప్పుడు సుప్పిని..సుద్దపూస కూడా!

కొడాలి నాని నోరు తెరిస్తే లుచ్చా భాష మాట్లాడతారు. ప్రతి పదానికి ముందూ వెనుకా బూతులుంటాయి. ఇలాంటి భాష ఇప్పుడు మెరుగుపడింది. ఓడిన తర్వాత తొలి సారి మీడియా ముందుకు వచ్చిన ...

రైల్వే ట్రాఫిక్ రెడ్డి చేసిన భారీ లిక్కర్ స్కాం !

ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేర్ టేకర్ సీఎంగా ఉండగానే ఆయన ప్రభుత్వంలోని అవినీతి పుట్ట బద్దలవుతోంది. ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారాన్ని గుప్పిట పట్టిన వాసుదేవరెడ్డి అనే అధికారి ఫైళ్లు దొంగతనం చేసి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close