గోవా లో ఏం జరిగింది ?!

ఓ తెలుగు సినీ మ్యాగజైన్ పబ్లిషర్, పలు సినిమాలకు పీఆర్వో గా, డిస్ట్రిబ్యుటర్ గా చేసిన ఓ వ్యక్తి గోవా వేదికగా ఇటివలే అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటుల సమక్షంలో ఇది జరిగింది. అయితే ఈ వేడుకలో తమని అవమానించారంటూ కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు కొందరు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యక్తిపై చేసిన విమర్శల్లో భాగంలో ‘మెగా పీఆర్వో’ అనే ట్యాగ్ కూడా వాడారు. దీంతో సోషల్ మీడియాతో పాటు కన్నడ స్థానిక పత్రికల్లో ఇది చర్చనీయంశమైయింది. తెలుగు చిత్ర పరిశ్రమను తప్పుబడుతూ కథనాలు వెలువరించడంతో పాటు మెగా పీఆర్వో అనే ట్యాగ్ వైరల్ అయ్యింది

దీంతో దినిపై నిర్మాత అల్లు అరవింద్‌ క్లారిటీ ఇవ్వాల్సివచ్చింది. ”ఆ వ్యక్తి మా కుటుంబంలో ఎవరికీ పీఆర్‌వో కాదు. మేము ఎక్కడా మా పీఆర్వో అని చెప్పలేదు. కానీ మా పేరుతో వార్తలు రాశారు. వాటిని చూసి నేను ఎంతో బాధపడ్డా. అది పూర్తిగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయం.పర్సనల్ ఫెయిల్యూర్‌. ఒక వ్యక్తి చేసిన పనిని వేరే వాళ్లకు, ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు”అని స్పష్టం చేశారు అరవింద్.

సదరు వ్యక్తి చాలా ఏళ్ళుగా పత్రిక పేరుతో అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా వరకూ ఆ వేడుకలు హైదరాబాద్ లో జరిగేవి. ఐతే ఆమధ్య దుబాయ్ లో చేసిన వేడుక విజయవంతమైయింది. ఈసారి గోవాలో వేడుక చేయాలని ఏర్పాట్లు చేశాడు. వేడుక జరిగింది కానీ రసాభాసా మారింది.

తెలుగు కన్నడ తమిళ మళయాళ పరిశ్రమ నటీనటులని పురస్కరించుకోవాలని సన్నాహాలు చేశారు. కానీ కార్య నిర్వహణలో లోపాలు జరిగాయి. వచ్చిన సెలబ్రిటీలకు సరైన వసతి కల్పించలేకపోయారు. అలాగే తెలుగు అవార్డులు ముగిసిన తర్వత వేదికలో కరెంట్ లేకుండాపోయింది. దీనికి కారణం కూడా వేదికకు చెల్లించాల్సిన డబ్బు విషయంలో ఎక్కడో తేడాలు రావడంతో కరెంట్ కట్ చేశారని చెబుతున్నారు. నిజానికి ఈ వేడుకకు గోవా ముఖ్య్యమంత్రి రావాలి. కానీ ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని తెలుసుకున్న ఆయన వేడుకకు రాకుండానే వెనుతిరిగారు.

ఈ వేడుకలని సింగిల్ హ్యాండ్ పై చాలా చక్కగా నిర్వహిస్తారని పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తి గోవా వేడుకని మాత్రం సరిగ్గా నిర్వహించలేక విమర్శలు పాలయ్యారు. అయితే ఆ వ్యక్తిని ఉద్దేశించి మెగా పీఆర్వో అనే ట్యాగ్ కూడా వార్తల్లో నిలవడంతో స్వయంగా అల్లు అరవింద్ స్పందించాల్సి వచ్చింది.

అయితే కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని మెగా పీఆర్వో అనడానికి కారణాలు వున్నాయి. ఆ వ్యక్తి ఇప్పటివరకూ తనని తానూ మెగా పీఆర్వో గానే ప్రోజెక్ట్ చేసుకున్నారు. ఆయన ట్విట్టర్ బయో లో కూడా మెగా పీఆర్వో అని వుంటుంది. కానీ నిజానికి మెగా కుటుంబానికి పర్శనల్ పీఆర్వో అని ఎవరూ లేరు. సినిమాకి జరుగుతున్నప్పుడు ఆ సినిమా పీఆర్వోనే వుంటారు. హీరో, నిర్మాత ఇష్టం ప్రకారం పీఆర్వోలు మారుతుంటారు. అంతేకానీ మహేష్ బాబుకు బిఏ రాజు తరహ పెర్మినెంట్ పీఆర్వో వ్యవహారం కాదది. అయితే ఇప్పుడీ వివాదంతో, అల్లు అరవింద్ మాటలతో ఆ వ్యక్తి మెగా పీఆర్వో కాదనే స్పష్టత వచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మాయావ‌న్’ టీజ‌ర్‌: సూప‌ర్ హీరో Vs సామాన్యుడు

https://youtu.be/jQ5f_tGienU దుష్ట‌శ‌క్తికీ, సామాన్యుడికీ పోరు ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటుంది. దానికి సైన్స్‌, దైవ శ‌క్తి తోడైతే ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌ల విడుద‌లైన 'హ‌నుమాన్‌' ఈ జోన‌ర్ క‌థే. ఇప్పుడు సందీప్ కిష‌న్...

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ – బీజేపీ కౌంటర్ ఫలిస్తుందా..?

తెలంగాణకు పదేళ్లలో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ కు కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. అరవై ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఇచ్చింది వంకాయ....

సింగిల్ పీస్… సాయి పల్లవి

'భానుమతి ఒక్కటే పీస్... హైబ్రిడ్ పిల్ల' ఫిదా సినిమాలో సాయి పల్లవి చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ సాయి పల్లవి నట, వ్యక్తిగత జీవితానికి సరిగ్గా సరితూగుతుంది. సాయి పల్లవి ప్రయాణం...

ఆ బటన్లు నొక్కిన డబ్బులు రానట్లే – ఓటర్లకు మస్కా !

జనవరి నుంచి ఊరూరా వెళ్లి ఉత్తుత్తి బటన్లు నొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు పోలింగ్ రోజు వారి ఖాతాల్లో డబ్బులేసి ఓట్లు దండుకోవాలనుకున్నారు. ఈసీని మ్యానేజ్ చేసుకోవచ్చనుకున్నారు. అందుకే వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close