దివాలా తీయించడానికి “సిద్ధం”

ఐదేళ్ల కిందట వంద ఆదాయం ఉంటే.. ఇప్పుడు కూడా అదే ఆదాయం ఉంటే… ఆర్థిక పరిభాషలో ఆదాయం తగ్గినట్లే. ఎందుకంటే ఐదేళ్ల కిందట ఉండే ధరలు ఇప్పుడు ఉండవు. అప్పట్లో వందకు నాలుగు కేజీల బియ్యం వస్తే ఇప్పుడు రెండు కేజీలు కూడా రావు. అంటే పతనమైనట్లే. ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా ఇంతే ఉంది. ప్రభుత్వ నిర్వాకాలతో ఆదాయం పెరగకపోగా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి సిద్ధం చేశారు.

ఏపీకి సొంత ఆదాయం తగ్గడం, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాకపోవడంతో ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే దివాలా చాయలు కనిపించాయి. ఏకంగా రూ.90 వేల కోట్ల వరకు లోటు నెలకొంది. అప్పులు చేస్తున్నా, కేంద్రం నుంచి వస్తున్న నిధులు 50 శాతం వరకే ఉండడంతో దాని ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. రిజర్వ్‌బ్యాంకు వెల్లడించిన నివేదిక మేరకు 12 నెలల కాలానికి గానూ బడ్జెట్‌లో ఆమోదించిన గణాంకాలకు, డిసెంబరు వరకు వచ్చిన గణాంకాలకు మధ్య పొంతన లేదు. ఏడాదికి రూ.2,79,279 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పొందుపరచగా, తొలి తొమ్మిది నెలల్లో కేవలం రూ.1,88,862 కోట్లు వచ్చినట్లు తేలింది.

ఇందులో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,02,651 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పటి వరకు రూ.91,136 కోట్లు మాత్రమే చేతికందింది. పన్నేతర ఆదాయం రూ.15,400 కోట్లకు గానూ, రూ.3,971 కోట్లు మాత్రమే వచ్చినట్లు తేలింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో కోతలు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపేణా రావాల్సిన నిధుల్లో గణనీయంగా కోతలు పడడం ఖజానాకు సమస్యగా మారింది. ఏడాది మొత్తానికి రూ.46,836 కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నప్పటికీ తొమ్మిది నెలల్లో కేవలం రూ.24 వేల కోట్లే రావడంతో అధికారులు కంగుతిన్నారు. రుణాలు కూడా అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగానే సేకరించుకోవడం గమనార్హం. సంవత్సరం మొత్తానికి అన్ని రుణాలు కలిపి రూ.49 వేల కోట్లు సేకరించాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.69,716 కోట్లు సేకరించారు. రుణాల రూపేణా సేకరించిన మొత్తమే లోటుగా చూపిస్తున్నారు.

ఏటా లక్ష కోట్ల రుణాలు ఖాయంగా తీసుకుంటున్నారు. అప్పుల కోసమే ఆదాయంలో సగానికిపైగా కట్టాల్సి వస్తోంది. ఆర్బీఐకి చాలా అప్పుల వివరాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

నో రిఫండ్ బుకింగ్ – 9కి విశాఖ హోటల్స్ రెడీ !

వైసీపీ నేతలు చేస్తున్న అతి కారణంగా విశాఖలో 9వ తేదీన హోటల్స్ నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. కానీ ఆ రోజున విశాఖలో ఉన్న హోటళ్లలో ఇప్పటికే వందల కొద్ది రూములు...

ఆర్కే పలుకు : మీడియా విశ్వసనీయతపై ఆర్కే ఆవేదన

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతోందని.. ప్రజలు ఎవరూ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడానికి కేటాయించారు. చాలా కష్టపడి...

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close