హ‌రీష్‌కు ఓకే చెప్పిన ఆ స్టార్ హీరోలెవ‌రు?

ఒకేసారి రెండు సినిమాల‌తో బిజీ అయిపోయాడు హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీస్తున్న ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌’కి గ్యాప్ రావ‌డంతో ర‌వితేజ‌తో `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌`ని ప‌ట్టాలెక్కించేశాడు. ఈగిల్ స‌క్సెస్ మీట్ లో హ‌రీష్ మాట్లాడుతూ త్వ‌ర‌లోనే ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో సినిమా చేస్తున్నాను, ఆ డిటైల్స్ కూడా రాబోతున్నాయి అంటూ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు హీరోలెవ‌రు? అనే ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న మొద‌లైంది.

ఇందులో ఓ హీరో మెగాస్టార్ చిరంజీవి అని టాక్‌. చిరు – హ‌రీష్‌లు క‌లిస్తే ఆ కాంబో క్రేజీగా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ సైతం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీలో ఫిక్స‌య్యే ఛాన్సుంది. చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఎప్ప‌టి నుంచో అనుకొంటోంది. ఇప్పుడు ఆ సంస్థ‌లోనే ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ చేస్తున్నాడు. సో.. ఈ కాంబో అలా కుదిరేసింది. మ‌రో సినిమా.. ఎవ‌రితో అనేది తేలాల్సివుంది. ఈసారి ఓ యువ హీరోతో హ‌రీష్ జ‌ట్టు క‌ట్టే అవకాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్ని హ్యాండిల్ చేయ‌గ‌లిగే ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ ఒక‌డు. త‌న‌తో సినిమాలు చేయ‌డానికి హీరోలంతా సిద్ధ‌మే. అయితే.. వాళ్లంతా బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌తీ స్టార్ హీరో చేతిలోనూ రెండు మూడు ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇంత బిజీలో హ‌రీష్‌కు డేట్లు ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు. `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌` సెట్స్‌పై ఉండ‌గానే ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డానికి సిద్ధంగా ఉన్నాడు హ‌రీష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close