ముద్రగడకు అంత బలం ఉంటే ఎందుకు వద్దనుకున్నారు !?

ముద్రగడ పద్మనాభం మళ్లీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారని ప్రచారం ప్రారంభం కాగానే .. అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీతను సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. అయితే అభ్యర్థిత్వం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆమె చెబుతున్నారు. కానీ పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే వైసీపీ తరపున ముద్రగడే పోటీ చేస్తారని .. వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతన్నాయి.

నిజానికి ముద్రగడ పద్మనాభం గతంలో వైసీపీలో చేరాలనుకున్నారు. చాలా కాలంగా ఆయన వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఇచ్చి ఐదు శాతం రిజర్వేషన్లు రద్దు చేసినా ముద్రగడ పెద్దగా మాట్లాడలేదు. జనవరి ఒకటో తేదీన ఆయన స్వగ్రామంలో సమావేశం పెట్టి వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించాలని అనుకున్నారు. మద్రగడ లేదా ఆయన కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్దమయిందని చెప్పుకున్నారు.

కానీ తర్వాత ఆయనకు ఎలాంటి సమాచారం రాలేదు. తాడేపల్లికి వెళ్లి హోటల్‌లో నాలుగు రోజులు పిలుస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నా పిలుపు రాలేదు. వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో టీడీపీ లేదా జనసేనలో చేరుతానని ప్రకటించారు. ఆ పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందులేదు. అయితే ఇప్పుడు పవన్ పై నిలబెట్టడానికి ఆయన సరిపోతారని వైసీపీ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మామూలు అభ్యర్థులపై పోటీకే అయన పనికి రారనని అనుకుంటే.. ప వన్ పై ఎలా సరిపోతారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇదోరకమైన మైండ్ గేమ్ అని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close