ప్రజాస్వామ్యం అంటే ఇదే : పార్టీలు ఓడలనుకుంటే బళ్లు అయిపోతాయ్ !

ప్రజాస్వామ్యం అంటే… ఇదే. ఎవరైనా ప్రజలు అధికారం ఇచ్చినంత వరకే కింగ్‌లు. . వాళ్లను తక్కువ అంచనా వేసి… మాకు తప్ప ఎవరికీ ఓటేసే దిక్కు లేదు అనుకుని చెలరేగిపోతే.. ఇంటికి పంపించేస్తారు. కోలుకోలేనంతగా దెబ్బకొడతారు. చరిత్రలో అలాంటి తిరస్కరణకు గురైన పార్టీలు చాలా ఉన్నాయి . ఇప్పుడు బీఆర్ఎస్ అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత బీఆర్ఎస్ టిక్కెట్ల కోసం ఎంత డిమాండ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ క్రేజ్ ఎలా ఉండేదంటే… కేసీఆర్ ఎవర్ని నిలబెట్టినా… ఓటర్లు పట్టించుకునేవారు కాదు. కేవలం కారు గుర్తునే చూసేవారు. జహీరాబాద్ లో బీబీ పాటిల్ అనే ఎంపీకి తెలుగు కూడా రాదు. అయినా రెండు సార్లు కారు గుర్తుకు ఉన్న క్రేజ్ వల్లే గెలిచారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ వదిలేసి వెళ్లిపోయారు.

అలాంటి ఉన్నత స్థితిని చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అభ్యర్థుల కోసం వెదుక్కుంటోంది. పోటీ చేయమని నేతల్ని బతిమాలుతోంది. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. కేసీఆర్ అభ్యర్థుల విషయంలో ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నారో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థే ఉదాహరణ. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడో సైలెంట్ అయ్యారు. ఆయనసోదరుడి కుమారుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఎంపీ అసలు నోరు తెరిచి చిన్న ప్రసంగం కూడా చేయలేరు. అయినా ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు.

సిట్టింగ్ ఎంపీలు చేతులెత్తేయడంతో కొత్త వారు ఎరూ ముందుకు రావడం లేదు. చేవెళ్ల నుంచి ఖమ్మం వరకూ అదిలాబాద్ నుంచి నల్లగొండ వరకూ..అభ్యర్థులకోసం వెదుకులాట తప్పడంలేదు. చివరికి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని… రెండు, మూడు సీట్లు వారికి ఇచ్చేద్దామని ఆలోచన చేస్తున్నారు..

రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగితే… పాతాళానికి ప్రజలు తొక్కేస్తారు. చరిత్రలో చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి ఉండవచ్చు కానీ.. ఆ పార్టీలపై ప్రజాభిమానం తగ్గలేదు. కానీ పతమైన పార్టీలు మాత్రం.. అహంకారం వల్లే నష్టపోయాయి. ఉనికిలో లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ కు రాకుండా కష్టపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీ పెద్దలకు ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close