ఆస్కార్‌లో సంచ‌ల‌నం.. న‌గ్నంగా వేదిక‌పై!

ఆస్కార్ వేడుక అంటేనే ఓ వైబ్రేష‌న్‌. సెల‌బ్రేష‌న్‌. దాంతో పాటు స‌న్సేష‌న్ కూడా. ప్ర‌తీసారీ ఆస్కార్ వేదిక‌పై ఏదో ఓ సంచ‌ల‌నం న‌మోద‌వుతూ ఉంటుంది. ఈసారి.. ఓ న‌టుడు న‌గ్నంగా వేదిక‌పైకి వ‌చ్చేశాడు. అదే టాక్ ఆఫ్ ది ఆస్కార్ అయిపోయింది.

ప్రముఖ హాలీవుడ్ నటుడు, రెజ్లర్ జాన్ సీనా ఇప్పుడు ఈ సంచ‌ల‌నానికి కేంద్ర బిందువు అయ్యాడు. ‘బెస్ట్ కాస్ట్యూమ్స్’ కేట‌గిరీలో అవార్డు ప్ర‌క‌టించే అవ‌కాశం జాన్ సీనాకి ద‌క్కింది. త‌ను ఈ అవార్డు ప్ర‌క‌టించ‌డానికి వేదిక‌పై న‌గ్నంగా వచ్చి, అంద‌రినీ షాక్‌కి గురి చేశాడు. ఆస్కార్ విజేత‌ల వివ‌రాలు ఓ క‌వ‌ర్లో ఉంటాయి క‌దా, ఆ క‌వ‌ర్‌ని జ‌న‌నాంగాల‌కు అడ్డుగా పెట్టుకొన్నాడు. కాస్ట్యూమ్స్ విజేత‌ని ప్ర‌క‌టించ‌డానికి ఒంటిమీద కాస్ట్యూమ్స్ లేకుండా రావడ‌మే ఈ ఆస్కార్ వెరైటీ.

1974లోనూ ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగిందిజ‌ సరిగ్గా 50 ఏళ్ల కిందట జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఓ న‌టుడు న‌గ్నంగా ఆస్కార్ వేదిక‌పైకి వ‌చ్చి, అంద‌ర్నీ షాక్‌కి గురి చేశాడు. అది గుర్తు చేయ‌డానికే.. ఇప్పుడు జాన్ సీనా ఇంత సీన్ క్రియేట్ చేశాడు. ‘మగాడి శరీరం జోక్ కాదు. కాస్ట్యూ్మ్స్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా’ అని ఓ జోక్ పేల్చి అంద‌రినీ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అంత‌లోనే ఓ చిక్కు వ‌చ్చింది. క‌వ‌ర్‌లో ఉన్న విజేత పేరు బ‌య‌ట‌కు తీసి ప్ర‌క‌టించాలి. క‌వ‌ర్ అడ్డు తొల‌గిస్తే, త‌ను పూర్తిగా న‌గ్నంగా మారిపోతాడు. అందుకే యాంకర్ జిమ్మీ కెమెల్ ఈ విష‌యంలో జాన్ సీనాకు సాయం చేశాడు. కవర్‌లో ఉన్న ఆస్కార్ విజేత పేరు చదివి.. జాన్‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించాడు.

ఆస్కార్ వేదిక‌పై న‌గ్నంగా రావ‌డం ఏమిట‌ని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కొంత‌మంది ఇదే వెరైటీ అని న‌వ్వుకొంటున్నారు. అయితే ఇదంతా ఆస్కార్ స్క్రిప్టులో భాగ‌మే. ప్ర‌తీసారీ ఏదో ఓ విష‌యంలో స‌న్సేష‌న్ చేయ‌డం ఆస్కార్ క‌మిటీకి అల‌వాటే. వాళ్ల స్క్రిప్టు ప్ర‌కార‌మే ఇదంతా జ‌రిగి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

HOT NEWS

css.php
[X] Close
[X] Close