డ్రై ఫ్రూట్స్‌కి రూ.35 వేలు అడిగిన హీరోయిన్‌!

సినిమా అంటే.. నిర్మాత‌ల్ని పీల్చి, పిప్పి చేయ‌డ‌మే. ఓ సినిమా తీయాల‌నుకోవ‌డం, చెర‌కు మిష‌న్‌లో చెరుగ్గ‌డ పెట్ట‌డం రెండూ ఒక‌టే. రెమ్యున‌రేష‌న్ల పేరుతో నిర్మాతల్ని బాదేస్తున్నారు. దానికి తోడు సెట్లో హీరోలు, హీరోయిన్లూ కోరే గొంతెమ్మ కోర్కెల‌కు, వాళ్ల డిమాండ్ల‌కూ నిర్మాత‌ల గొంతుల్లో ప‌చ్చి వెల‌క్కాయ‌లు ప‌డుతున్నాయి. అందుకు బోలెడ‌న్ని నిద‌ర్శ‌నాలు. సాక్ష్యాలు.

తాజాగా ఓ టాప్ హీరోయిన్ డ్రై ఫ్రూట్స్ పేరుతో రూ.35 వేల బిల్లు వ‌సూలు చేసింద‌ట‌. ‘ఈ రోజుల్లో అదేమాత్రం’ అనుకొంటే ఖ‌ర్జూరంపై కాలేసిన‌ట్టే. ఇది సినిమా మొత్తం బిల్లు కాదు. ఒక్క రోజు బిల్లు. డ్రై ఫ్రూట్స్‌కే రూ.35 వేలేస్తే.. ఇక లంచ్‌, డిన్న‌ర్ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి నిర్మాత ప్రాప‌ర్టీలో కొంత మేర అమ్ముకోవాల్సిందే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ‘మీరేం తింటారో చెప్పండి.. మేమే తీసుకొస్తాం’ అని నిర్మాత చెప్పినా అమ్మ‌డు వినిపించుకోద‌ట‌. ”నేను కొనేవి.. తినేవి వేరే ఉంటాయి లెండి..” అంటూ ఆ బిల్లు ముక్కు పిండి వ‌సూలు చేస్తోంది. నిజానికి ఈ రూ.35 వేల లెక్క చాలా చిన్న‌ది. ఇలాంటి ఖ‌ర్చులు బోలెడ‌న్ని ఉంటాయి. సెట్లో హీరోగారో, హీరోయినో అడుగు పెడితే.. వాళ్లిద్ద‌రి స్టాఫే అటూ ఇటుగా 20మంది ఉంటారు. హీరోలు ఇక్క‌డివాళ్లే కాబ‌ట్టి స‌మ‌స్య లేదు. హీరోయిన్లు చెన్నై నుంచో, బెంగ‌ళూరు నుంచో ఊడి ప‌డ‌తారు. వాళ్ల స్టాఫ్‌కి కావ‌ల్సిన వ‌స‌తి.. నిర్మాతే భ‌రించాలి. హీరోయిన్ ఏ స్టార్ హోటెల్ లో దిగితే.. అదే హోటెల్ లో వాళ్ల‌కూ రూమ్ బుక్ చేయాలి
ఆ ఖ‌ర్చుల‌న్నీ నిర్మాత‌ల‌మీదే. అంతెందుకు ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు సైతం న‌లుగురు అసిస్టెంట్ల‌తో సెట్లోకి అడుగు పెడుతున్నాడంటే ప‌రిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవొచ్చు. పేరున్న ఓ క్యారెక్ట‌ర్ హీరోకి ఎంత‌మంది టీమ్ పెడుతున్నారో.. అంతేమంది టీమ్ తన‌కూ కావాల‌ని డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. అస‌లే ఓటీటీలు, శాటిలైట్ రేట్లూ లేక ఓవైపు, థియేట‌ర్‌కు జ‌నాలు వ‌స్తారో రారో అనే అనుమానాల‌తో మ‌రోవైపు నిర్మాత బిక్కు బిక్కుమంటుంటే, దానికి తోడు ఈ రోక‌లిపోటు లాంటి వ్య‌వ‌హారాలు మ‌రింత కృంగ దీస్తున్నాయి. వీటి నుంచి నిర్మాత‌లు బ‌య‌ట‌ప‌డేదెప్పుడో..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close