ఏపీ ఎన్నికలు : ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనగలరా ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనగలరా లేదా అన్నది తేల్చేసే ఎన్నికలుగా భావిస్తున్నారు. పరిపాలన పేరుతో ప్రజల్ని దోచుకుని ఎన్నికల సమయంలో వారికే ఆ డబ్బుల్లో కొంత భాగం ఇచ్చి ఓట్లు కొనే సరికొత్త ప్రజాస్వమ్య ప్రక్రియకు అధికార పార్టీ పూర్తి స్థాయిలో తెర తీసింది. ఈ మోడల్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందా అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఎవరికైనా ఓ విలువ కట్టే అధికార పార్టీ !

వారూ వీరు అని కాదు.. ఎవరికైనా ఓ విలువ కట్టేస్తుంది ఏపీ అధికార పార్టీ. గౌరవంగా తీసుకుని చెప్పినట్లుగా పని చేస్తే సరి లేకపోతే ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే చాలా మంది ఇచ్చింది తీసుకుంటున్నారు. కొంత మందికి ఏమమీ ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు అది వేరే విషయం. ఇక్కడా కొన్ని లెక్కలు ఉంటాయి. పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుంచి… చిట్ట చివరికి గ్రామ వాలంటీర్ల వరకూ అందరికీ డబ్బులు పంచేశారు. ఇక ఓటర్లకు పంచడమే మిగిలింది. వారికి ఎంత విలువ కడతారో తెలియాల్సి ఉంది.

అందుబాటులో లెక్క లేనంత నగదు !

నిజానికి నోట్ల రద్దు తర్వాత .. నోట్లు ఎక్కడికి పోతున్నాయో తెలుసుకునే వ్యవస్థ కేంద్రానికి ఉంది. కానీ ఏపీలో గత ఐదేళ్లుగా రెండు ప్రధాన వ్యాపారాలు పూర్తిగా నగదు రూపంలోనే నిర్వహిస్తున్నారు. ఒకటి మద్యం.. రెండు ఇసుక. ఈ రెండింటిలోనూ దేనికీ సరైన లెక్కలు ఉండవు. నగదు తీసుకోవడం వల్ల వారు చెప్పిందే ఆదాయం.. ఇచ్చిందే కలెక్షన్. ఇందులో నోట్లు కొన్ని వేల కోట్లు దారి మళ్లాయని అర్థంచేసుకోవచ్చు. ఆ డబ్బంతా ఇప్పుడు ఓట్లు కొనడానికి తెరపైకి వస్తోంది.

ప్రజాస్వామ్యం అమ్ముడైతే ఇక ఓటర్లే బాధితులు

ఓటుకు ఉన్న విలువ తెలియని వారు ఎంతో మంది ఉంటారు. వారిని రాజకీయ పార్టీలు అలా తయారు చేశాయి. డబ్బులు ఇవ్వకపోతే ఓటేయాలా అన్న ఆలోచనను తెచ్చాయి. ఆ రాజకీయ పార్టీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఒక్క ఆలోచన ఓటర్ చేస్తే.. రాజకీయం మారిపోతుంది. ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలాంటి ఆలోచన ఓటర్లకు ఎప్పుడు వస్తుందన్న దానిపైనే భవిష్యత్‌ పై ఆశలు ఉంటాయి. లేకపోతే ప్రజాస్వామ్యం పేరుతో నిలువు దోపిడీ చేసి.. పది రూపాయలు పంచుతున్న వారే పాలకులుగా మారుతూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కు అన్నీ తెలుసు… ఢిల్లీ లిక్క‌ర్ కేసులో సంచ‌ల‌నం!

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కేసు బిగ్ ట‌ర్న్ తీసుకునేలా క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుపాలు కాగా... మాజీ సీఎం కేసీఆర్ కు ఈ స్కాం...

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోకి కేసీఆర్‌ను లాక్కొచ్చిన ఈడీ

కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదీ కలసి రావడం లేదు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరును ఈడీ తొలి సారిగా ప్రస్తావించింది. లిక్కర్ స్కాం గురించి కవిత ముందే కేసీఆర్‌కు చెప్పిందని.. గోపికుమరన్...

ఈవారం బాక్సాఫీస్‌: మూడు సినిమాల ముచ్చ‌ట‌

ఐపీఎల్ హంగామా అవ్వ‌గానే టాలీవుడ్ కి మూడ్ వ‌చ్చింది. వ‌రుస‌గా సినిమాల్ని రంగంలోకి దింపే ప‌నిలో ప‌డింది. ఈ వారం ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. విశ్వ‌క్‌సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్...

కూటమి గెలుపు ఖాయమని సజ్జల సంకేతాలు..!?

వైసీపీ ఓటమి ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ దిశగా మానసికంగా ప్రిపేర్ అవుతున్నట్టు ఉన్నారు. ఫలితాల విడుదలకు మరో కొద్ది రోజుల సమయమే ఉండటంతో ఇప్పుడు గెలుపుపై అతికి పోయి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close