తెలుగు 360 ఎఫెక్ట్ : మహి వి రాఘవ్ హర్సీలీ హిల్స్ యాత్ర ఫ్లాప్ !

యాత్ర 2 అనే సినిమాను తీసి… ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి రెండు ఎకరాల స్థలం కొట్టేద్దామనుకున్న మహి వి రాఘవ్ అలియాస్ మహేందర్ రెడ్డి … చివరికి నిరాశే ఎదురయింది. ఆయనకు కేటాయించాలనుకున్న రెండు ఎకరాల స్థలం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ భూకేటాయింపు పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్దం కావడంతో.. కింది స్థాయి అధికారులు ఫైళ్లను ముందుకు కదిలించేందుకు నిరాకరించారు. ప్రభుత్వ పెద్దలు ఎంత ఒత్తిడి చేసినా తాము ఇరుక్కోవడానికి సిద్ధంగా లేమని చెప్పడంతో.. చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంతకు ముందు ఆ రెండు ఎకరాల స్థలంలో నిర్మించాలనుకున్న క్రీడా శిక్షణా కేంద్రం నిర్మాణాలను కొనసాగించనున్నారు.

యాత్ర పేరుతో వైఎస్ జగన్ కు ఎలివేషన్లు ఇచ్చే సినిమాలు తీసి నాలుగు భూములు వెనకేసుకోవాలనుకున్న మహేందర్ రెడ్డి అలియాస్ మహి వి రాఘవకు.. మీడియా ఈ వ్యవహారంలోని లొసుగుల్ని బయట పెట్టి షాకిచ్చింది. తెలుగు 360 విస్తృతంగా కథనాలను ఇచ్చిది. వీటిపై ఆవేశపడిన మహి వి రాఘవ్.. తాను భూములు తీసుకోనని చాలెంజ్ చేశారు. కానీ ఆయన తన దరఖాస్తును విత్ డ్రా చేసుకోలేదు. భూములు కేటాయిస్తే.. తీసేసుకుందామనుకున్నారు. అధికారులు ధైర్యం చేయకపోవడం.. ఎన్నికల కోడ్ రావడంతో.. చివరికి ఆ భూములు చేతికి అందలేదు.

సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ డైరక్టర్ గా పేరు పడి.. ఓ మాదిరి సినిమాలు తీయలేక తంటాలు పడే మహి వి రాఘవ… రూరల్ స్టూడియోస్ కట్టిస్తానని ఓ పాంప్లెట్ తయారు చేసుకుని అదే తన విజన్ అని చెప్పుకుని ప్రభుత్వం దగ్గర ప్రజల ఆస్తి అయిన భూములు కొట్టేయాలనుకున్నారు. దానికి రాయలసీమ సెంటిమెంట్ వాడారు. ఇరవై వేల కోట్ల పెట్టుబడులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న అమరరాజాను.. ఇగోల కారణంగా తరిమేసి.. సీమ యువత భవిష్యత్ ను అంధకారం చేసిన ప్రభుత్వం.. అదే రాయలసీమ అభివృద్ధి పేరును భూములు దోచి పెట్టడానికి మాత్రం.. వాడుకోవడం బట్టబయలైంది.

మహి వి రాఘవ్ .. ముందుగా తాను డబ్బా సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకుని వాటిని భూములు పొందడం ద్వారా కవర్ చేసుకోవాలన్న ప్లాన్లు ఆపేసుకోవాలి. ప్రేక్షకుల్ని మెప్పించే సినిమాలు తీయాలి. ఆ తర్వాత భూములు, స్టూడియోల పేరుతో భూముల కేటాయింపు గురించి ఆలోచించాలి. లేకపోతే కేసుల పాలై… అసలు కెరీరే లేకుండా పోయే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close