జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘క‌ల్కి’ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ఓ స్ప‌ష‌క్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తారు. మేలో రావాల్సిన సినిమా ఇది. అయితే ఏపీలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో జూన్‌కు వెళ్లింది. అయితే జూన్‌లో మంచి డేట్ ఎప్పుడా? అని చిత్ర‌బృందం తీవ్ర‌మైన త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డింది. చివ‌రికి జూన్ 27 అయితే బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చింది. జూన్ 27న టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో భార‌త్ త‌ల‌ప‌డితే… వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుందేమో అని చిత్ర బృందం కాస్త ఆలోచించింది. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండు సెమీస్‌లు ఉంటాయి. ఆ మ్యాచ్‌లో భార‌త్ త‌ల‌పడుతుందా, లేదా? అనేది ఇప్పుడే చెప్ప‌లేం. దాని కోసం సినిమా విడుద‌ల తేదీని మ‌రోసారి వాయిదా వేయ‌డం చిత్ర‌బృందానికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే మ‌రేం ఆలోచించ‌కుండా జూన్ 27 డేట్‌పై క‌ర్చీఫ్ వేసిన‌ట్టు స‌మాచారం అందుతోంది. మేలో ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చేసిన త‌ర‌వాత‌.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని ముమ్మ‌రం చేయాల‌న్న‌ది ప్లాన్‌. అప్ప‌టికి మ‌రో 40 రోజుల స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి.. ప్ర‌మోష‌న్ల‌కు కావ‌ల్సినంత గ్యాప్ దొరికిన‌ట్టే.

నాగ అశ్విన్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అమితాబ్, క‌మ‌ల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అమితాబ్ పాత్ర‌కు సంబంధించిన ప్రోమో ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఇక క‌మ‌ల్ ఇంట్రో ఎలా ఉంటుందో చూడాలి. క‌మ‌ల్ పాత్ర‌ని అతి త్వ‌ర‌లోనే ప‌రిచ‌యం చేయ‌డానికి చిత్ర‌బృందం క‌స‌ర‌త్తులు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close