మెగా హీరోతో మేర్ల‌పాక గాంధీ

‘వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి హిట్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ. ‘ఏక్ మినీ క‌థ‌’ త‌ర‌వాత ఆయ‌న్నుంచి సినిమాలేం రాలేదు. ఇప్పుడాయ‌న మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టుకొని రంగంలోకి దిగ‌డానికి సిద్ధంగా ఉన్నారు. మెగా హీరో వ‌రుణ్ తేజ్‌కు ఓ క‌థ చెప్పి ‘ఓకే’ చేయించుకొన్న‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నార‌ని స‌మాచారం. క్రైమ్‌, అడ్వైంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ న‌డుస్తుంద‌ని స‌మాచారం. బ‌డ్జెట్ కూడా భారీగానే అవ‌స‌రం అవుతుంద‌ట‌. వ‌రుణ్‌తేజ్ చేసిన ‘ఆప‌రేష‌న్ వాలైంటైన్‌’ సినిమా డిజాస్ట‌ర్‌గా మారింది. ఆ ఎఫెక్ట్ ‘మ‌ట్కా’పై ప‌డింది. ‘మ‌ట్కా’ సినిమా ఆర్థిక‌ప‌ర‌మైన కార‌ణాల‌తో ఆగిపోయింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఇప్పుడు మేర్ల‌పాక గాంధీ సినిమా కూడా బ‌డ్జెట్ తో ముడిప‌డిన విష‌య‌మే. అయితే క‌థ ప‌ర్‌ఫెక్ట్ గా కుద‌ర‌డం, మేర్ల‌పాక గాంధీ మేకింగ్ పై న‌మ్మ‌కం ఉండ‌డంతో నిర్మాత‌లు ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధంగా ఉన్నార్ట‌. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close