టిల్లుకి మ‌ళ్లీ ప్ల‌స్సు!

గ‌త‌వారం విడుద‌లైన సినిమా ‘టిల్లు స్క్వేర్‌’. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డకు యూత్ లో ఫాలోయింగ్ ఏర్ప‌డ‌డం, పాజిటీవ్ టాక్ రావ‌డంతో.. మంచి వ‌సూళ్ల‌ని అందుకొంది. ఈవారం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఉండ‌డంతో ‘టిల్లు’ దూకుడుకు క‌ళ్లెం ప‌డ‌డం ఖాయం అనుకొన్నారంతా. నిజంగానే ‘ఫ్యామిలీ స్టార్‌’ బాగుంటే ‘టిల్లు’ ర‌న్ ఆగిపోయేది. కానీ విజ‌య్ సినిమాకు నెగిటీవ్ టాక్ రావ‌డంతో ‘టిల్లు’ దూకుడు ఈవారంతం కూడా కొన‌సాగ‌బోతోంది.

శుక్ర‌వారం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుద‌లైనా టిల్లుకి సైతం మంచి వ‌సూళ్లే ద‌క్కాయి. ‘ఫ్యామిలీ స్టార్’ నెగిటీవ్ రిపోర్ట్ తో.. ‘టిల్లు’ శ‌ని, ఆది వారాలు సైతం త‌న దూకుడు కొన‌సాగించే అవ‌కాశం ఉంది. దానికి తోడు… చిత్ర‌బృందం కూడా మ‌రో ద‌ఫా ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లెట్టింది. తొలి వారంలో దాదాపు రూ.90 కోట్లు వ‌సూలు చేసింది టిల్లు. ‘ఫ్యామిలీస్టార్‌’ పుణ్య‌మా అని.. ఇప్పుడు వంద కోట్ల మార్క్ ని అవ‌లీల‌గా చేరుకోవ‌డం ఖాయం. ఈవార‌మే మ‌ల‌యాళం సినిమా ‘మంజుమ్మ‌ల్ బోయ్స్’ విడుద‌లైంది. ఆ సినిమాకు సైతం మంచి రివ్యూలు అందుతున్నాయి. ఆల్రెడీ మ‌ల‌యాళంలో పెద్ద హిట్. కాబ‌ట్టి తెలుగులోనూ ప్రేక్ష‌కుల చూపు త‌న‌వైపు తిప్పుకొంది. ‘ఫ్యామిలీ స్టార్‌’ వైఫ‌ల్యం ఈ రెండు సినిమాల‌కూ బాగా క‌లిసి రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close