ట్యాపింగ్ కేసూ సీబీఐకే ఇవ్వాలంటున్న బీజేపీ !

రాజకీయంగా సున్నితమైన కేసులన్నింటినీ సీబీఐకే ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే ఇలాంటి డిమాండ్లు చాలా సార్లు చేసింది. అయితే బీఆర్ఎస్ జుట్టు తమకు అందిందని.. అది బీజేపీ చేతికి ఎందుకు ఇస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ పెద్దలు నిండా మునిగిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్‌కు కూడా విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్ర పరిధిలోని అంశాలపై విచారణకు ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కావాలని సిఫారసు చేస్తే చేయవచ్చు. లేదా కోర్టు ఆదేశిస్తే సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉంటుంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కావాలని బీజేపీ సానుభూతిపరుడు కోర్టుకు వెళ్తే అనుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గవర్నర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా తెరపైకి వచ్చింది. బీఎల్ సంతోష్ ఫోన్ ని కూడా ట్యాప్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ .. ఈ కేసు తమ చేతికి వస్తేనే మంచిదని భావిస్తోంది. అందుకే గవర్నర్ ద్వారా ప్రయత్నిస్తోంది. రేపు బీజేపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవ్ పార్టీ ఇష్యూ- అడ్డంగా బుక్ అయిన సినీ న‌టి హేమ‌

బెంగుళూరు రేవ్ పార్టీ కొత్త మ‌లుపు తీసుకుంది. రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ వాడిన‌ట్లు గుర్తించిన పోలీసులు... నార్కోటిక్ ప‌రీక్ష‌లు చేయిస్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన వారే ఎక్కువ‌గా ప‌ట్టుబ‌డ్డ‌ట్లు తెలుస్తుండ‌గా, ఓ...

కంటోన్మెంట్ ఉప ఎన్నిక : విజయం ఎవరిని వరిస్తుందో..?

లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడే ఇందుకు ప్రధాన కారణం. మల్కాజ్ గిరి లోక్ సభతోపాటు...

ఈటీవీ నుంచి మ‌రో ఓటీటీ.. ఈసారి వేరే లెవ‌ల్‌!!

సినిమా ప్ర‌పంచంలో ఓటీటీ భాగం అయిపోయింది. సినిమా వ్యాపారంలో ఓటీటీల‌దే కీల‌క భాగ‌స్వామ్యం. అందుకే ఓటీటీల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మీడియా రంగంలో అగ్ర‌గామిగా నిలిచిన‌ ఈనాడు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టింది....

క‌థాక‌మామిషు! (వారం వారం కొత్త క‌థ‌ల ప‌రిచ‌యం)

సాహితీ ప్ర‌క్రియ‌లో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. మాన‌సిక ఉల్లాసానికీ, స‌రికొత్త‌ ఆలోచ‌నా దృక్ప‌థానికీ క‌థ‌లు త‌మ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమ‌ధ్య‌కాలంలో క‌థ‌ల‌కు పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించేది కాదు. అయితే ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close