డోస్ పెంచుకుంటూ పోతున్న సునీత, షర్మిల !

వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులకు అండగా నిలవడంతో జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించారు సోదరీమణులు. వారు రోజు రోజుకు తమ డోస్ పెంచుకుంటూ పోతున్నారు. కడప లోక్‌సభలో షర్మిల ప్రజల్ని హంతకుడిగా.. వైఎస్ బిడ్డకా మీ ఓటు అని సూటిగా ప్రశ్నిస్తూ.. వస్తున్నారు. ప్రచారంలో ఈ ఎటాక్ తర్వాత స్థాయికి వెళ్తోంది. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన దళితులు, ముస్లింల ఓట్ బ్యాంక్‌ను కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు షర్మిల వ్యూహాత్మకంగా గురి పెట్టారు.

బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని.. బీజేపీ, వైసీపీ వేర్వేరు కాదని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో దళిత నేతల్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి ఆకర్షిస్తున్నారు. వైసీపీలో టిక్కెట్ దక్కని దళిత నేతల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంతకు ముందే ఆర్థర్, ఎలీజా పార్టీలో చేరగా ఇవాళ పూతలపట్టు ఎమ్మెల్యేను చేర్చుకున్నారు. గుంటూరుకు చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ తీరుతో మోసపోయిన నేతలంతా కాంగ్రెస్ గూటికే చేరుకుంటున్నారు.

మరో వైపు వైఎస్ సునీత కూడా ప్రతి రోజూ ఏదో ఓ టాపిక్ పై మాట్లాడుతున్నారు. షర్మిల ప్రచారం ప్రారంభంలో పాల్గొని.. ఆమె కూడా జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. మూడు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి జగన్ ఓటమే లక్ష్యమన్నారు. శనివారం కూడా జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ప్రెస్మీట్ పెట్టి కీలక విషయాలను వెల్లడించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ టి్క్కెట్ ఇవ్వడంతో వీరు ఏ మాత్రం తగ్గకూడదని డిసైడయ్యారు. జగన్ పై చెల్లెళ్ల పోరాటం ఓ రేంజ్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close