ఐదేళ్ల సర్వీస్ నష్టం – ఏబీవీకి యూపీఎస్సీ న్యాయం చేస్తుందా ?

క్రిమినల్ రికార్డు ఉన్న రాజకీయ నాయకుడి కుట్రల కారణంగా నిజాయితీ పరుడైన ఐపీఎస్ అధికారి ఐదేళ్లు టార్చర్ అనుభవించారు. తప్పుడు కేసులు.. ఫిర్యాదులు.. కోర్టులను సైతం లెక్క చేయకుండా సస్పెన్షన్ వంటి చర్యలు … అంతకు మించి అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారాలతో మానసిక వేదన కల్పించడం వంటివి ఎన్నో చేశారు. చేసిన తప్పేంటో చెప్పకుండా ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని రెండు సార్లు సిఫారసు చేశారు. ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ స్పష్టం చేసింది. కానీ ఇంత వరకూ రాష్ట్రం చర్యలు తీసుకోలేకపోయింది. ఎందుకంటే.. ఏబీవీపై ఒక్క ఆధారం కూడా లేదు.

టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేయడమే ఏబీవీ చేసిన తప్పు అన్నట్లుగా ఐదేళ్లుగా ఆయనపై పగ బట్టారు ప్రస్తుత పాలకులు. అనేక ఆరోపణలు మీడియాలో వచ్చేలా చేశారు. కానీ ఏ ఒక్కటీ నిజం కాదు. ఆయన ఐదేళ్ల సర్వీస్ ను కోల్పోయారు. వచ్చే నెలాఖరున రిటైర్మెంట్ ఉంది. ఆయన విషయంలో క్యాట్ తుది విచారణ మూడు రోజుల్లో చేపట్టనుంది. ఆయన కేసును స్పెషల్ గా పరిగణించి ఐదేళ్ల సర్వీస్ నష్టానికి ఏమైనా ఉపశమనం యూపీఎస్సీ ఇస్తే.. సంచలనం అవుతుంది.

ప్రస్తుతం ఉన్న అధికారుల్లో ఆయనే అత్యంత సీనియర్. డీజీపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పగబట్టిన ప్రభుత్వం వల్ల ఆయన అన్ని అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు డీజీపీ అవకాశం దగ్గరగా వస్తోంది. యూపీఎస్సీ న్యాయం చేస్తే… ఏపీలో సంచలనం అవుతుంది. ఆయనను వేధించిన వారికి గట్టి షాక్ తగిలినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వావ్… బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాములుగా లేదుగా!

తాజ్ మ‌హాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలిలెవ‌రోయ్... అన్న మాట చాలా సంద‌ర్బాల్లో గుర్తుకొస్తుంది. కిందిస్థాయిలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారిని గుర్తించ‌టం, గౌర‌వించ‌టం కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌లో మూల‌న ప‌డిపోయింది. కానీ, ఈసారి ఐపీఎల్ లో...

మెగా మ‌న‌సు చాటుకొన్న చిరు!

చిరంజీవి మ‌రోసారి త‌న ఉదార‌త చాటుకొన్నారు. అనారోగ్యంతో బాధ ప‌డుతున్న సినీ పాత్రికేయుడికి త‌న అభ‌యహ‌స్తం అందించారు. మీడియా స‌ర్కిల్‌లో ఉండేవాళ్ల‌కు జ‌ర్న‌లిస్టు ప్ర‌భు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే. చిరంజీవితో కూడా ఆయ‌న‌కు...

వైన్స్ ఓన‌ర్స్ Vs బార్ ఓన‌ర్స్… తెలంగాణ‌లో కొత్త పంచాయితీ

మూడు పువ్వులు... ఆరు కాయ‌లుగా సాగే వ్యాపారాల్లో మ‌ద్యం బిజినెస్ కూడా ఒక‌టి. తెల్లారి లేస్తే లెక్చ‌ర్లు ఇచ్చే పొలిటిక‌ల్ లీడ‌ర్స్ నుండి గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కు, కార్పోరేట్ సంస్థ‌లు ఇలా...

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మెగాస్టార్

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయన తాజాగా ఓ జర్నలిస్టుకు తన వంతు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close