కర్నూలు సిటీ రివ్యూ : టీజీ వెంకటేష్ వారసుడికి లక్ కలసి వస్తుందా ?

టీజీ వెంకటేష్. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నేత. 1999లో టీడీపీ తరపున కర్నూలులో ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలు మారి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన కుమారుడు మాత్రం టీడీపీనే అంటి పెట్టుకుని ఉన్నారు. కర్నూలులో సత్తా చాటాలనుకుుంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా కర్నూలు సిటీ రాజకీయాల్లో తండ్రీ కొడుకులది విడదీయలేని ముద్ర. 2014 , 2019 ఎన్నికలలో స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. 2014లో టీజీ వెంకటేష్ మూడు వేల ఓట్ల తేడాతో.. 2019లో టీజీ భరత్ వైసీపీ వేవ్‌లోనూ ఐదు వేల ఓట్ల తేడాతోనూ పరాజయం పాలయ్యారు. ఈ సారి మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని పోటీ పడుతున్నారు.

1952లో ఏర్పడిన కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు మంచి పట్టుంది. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండే కర్నూలులో ఈ సారి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ను బరిలోకి దింపింది అధికార వైసీపీ. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను తప్పించిన వైసీపీ.. ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌తో ఉద్యోగానికి రాజీనామా చేయించి మరీ ప్రజాక్షేత్రంలో పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో మైనార్టీ నేత హఫీజ్‌ఖాన్‌ను పోటీకి పెట్టింది ఫ్యాన్‌ పార్టీ. ఈ ప్రయోగం సక్సెస్‌ అవడంతో వరుసగా రెండోసారి కర్నూలు కోటను నిలబెట్టుకుంది వైసీపీ. ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి పోటీకి హఫీజ్‌ ఆసక్తి చూపినా.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో విభేదాలు కారణంగా ఆయనను పక్కకు తప్పించారు. వైసీపీ అధిష్టానం అండదండలతో కర్నూలులో అడుగుపెట్టిన వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్‌ కు రెండు వర్గాలు సహకరించకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఎస్వీ మోహన్ రెడ్డి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. హఫీజ్ ఖాన్ వర్గం అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రాజకీయాలకు కొత్త అయిన ఇంతియాజ్ వారిని ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. అందర్నీ కలిపేందుకు సజ్జల చాలా ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీజీ భరత్‌ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సుమారు 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన టీజీ భరత్‌ ఈ సారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్‌ తండ్రి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ గతంలో మంత్రిగా, రెండుసార్లు కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెంకటేశ్‌, 2019లో తన కుమారుడు భరత్‌ను బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో చేదు ఫలితం ఎదురైనా.. ఐదేళ్లు ఓపిక పట్టిన భరత్‌.. నిత్యం ప్రజలతో ఉంటూ ఇమేజ్‌ పెంచుకున్నారు. ఈ సారి ఎలాగైనా కర్నూలులో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను లోకల్‌… అంటూ ప్రచారం చేస్తున్న టీజీ భరత్‌ అధికార పార్టీ అభ్యర్థిని ఇరుకున పెడుతున్నారు. యువకుడిగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

వాస్తవానికి కర్నూలులో ముస్లిం ఓట్లు ఎక్కువ. ఆ తర్వాత ఎస్సీలు, వైశ్యులు కూడా గణనీయంగానే ఉన్నారు. రెడ్డి, బలిజ, బోయ సామాజిక వర్గాల ప్రభావం కూడా ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి. ఈ లెక్కల్లోనే వైసీపీ మైనార్టీని… టీడీపీ వైశ్య సామాజిక వర్గం నేతను పోటీలోకి దించాయి. రెండు పార్టీలు సామాజిక కోణంలో పకడ్బందీగా పావులు కదుపుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉన్నందున బీజేపీతో పొత్తు టీడీపీకి మైనస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ వైసీపీ అభిమానులైన మైనార్టీ ఓటర్లు ఆ పార్టీకే ఓటు వేస్తారని.. ఆ పార్టీపై వ్యతిరేకత ఉన్న వాళ్లు తమకే ఓటు వేస్తారని టీడీపీ నేతలంటున్నారు. అదే సమయంలో హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయని అనుకుంటున్నారు.

కర్నూలులో హోరాహోరీ పోరు సాగుతోంది. వైసీపీలో వర్గ విబేధాలు.. టీడీపీ అభ్యర్థిపై సానుభూతి.. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఈ సారి కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close