ప‌ర‌శురామ్‌కు దిల్ రాజు అభ‌య‌హ‌స్తం

‘గీత గోవిందం’ తో వ‌చ్చిన క్రేజ్‌ని కాపాడ‌లేక‌పోతున్నాడు ప‌ర‌శురామ్‌. ‘స‌ర్కారు వారి పాట‌’ ద్వారా మ‌హేష్ బాబు తో ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చింది. కాక‌పోతే ఆ సినిమా ఎబౌ ఏవ‌రేజ్ మార్క్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. క‌థ‌కుడిగా ఆ సినిమాలో మైన‌స్ మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’ విష‌యంలోనూ తేలిపోయాడు. ఈ సినిమాకు క‌నీసం వ‌సూళ్లు కూడా రాలేదు. దాంతో ప‌ర‌శురామ్ ప‌రిస్థితి ఏమిటా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర `రెంచ్ రాజు` అనే ఓ క‌థ ఉంది. దాన్ని కార్తీతో చేయాల‌ని ఆలోచ‌న‌. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్ట‌యితే, త‌ప్ప‌కుండా కార్తితో కాంబినేష‌న్ సెట్ట‌య్యేదే. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దాంతో కార్తి సినిమా డైలామాలో ప‌డింది.

అయితే దిల్ రాజు మాత్రం ప‌ర‌శురామ్ కు అభ‌య‌హ‌స్తం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ‘ఫ్యామిలీ స్టార్‌’ రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా ప‌ర‌శురామ్ తో మ‌రో సినిమా చేస్తాన‌ని ముందే మాటిచ్చాడ‌ట దిల్ రాజు. `రెంచ్ రాజు` క‌థ కార్తి ఓకే అన్నా, లేకున్నా – ఈ క‌థ‌కు సెట్ట‌య్యే మ‌రో హీరోని తెచ్చుకొంటే, దిల్ రాజు బ్యాన‌ర్‌లో ప‌ర‌శురామ్ సినిమా ఉంటుంది. దిల్ రాజు బ్యాన‌ర్ అంటే… ఏ హీరో అయినా, ఆలోచించ‌కుండా దూకేస్తాడు. దాంతో…. ‘రెంచ్ రాజు’పై ప‌ర‌శురామ్ న‌మ్మ‌కంతో ఉన్నాడు. `ఫ్యామిలీ స్టార్` కోసం ప‌ర‌శురామ్ రూ.14 కోట్ల పారితోషిం అందుకొన్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈసారి మాత్రం అందులో స‌గం ఇచ్చినా సంతోష‌మే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close