ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవరు కానీ ఓడిస్తారు !

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక వ్యూహంతోనే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంంది. షర్మిల ప్రత్యేకంగా ఓ బ్యాకప్ టీముని ఏర్పాటు చేసుకుని కీలకమైన నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోట ప్రభావం చూపే నాయకుల్ని ఆకర్షించి మరీ టిక్కెట్లు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్యేలు, ఓ కేంద్ర మాజీ మంత్రి వైసీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలంతా దళితులే. అంతే కాదు నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఖరారు చేసిన వారిలో చాలా మంది తమ తమ సామాజికవర్గాల్లో అంతో ఇంతో పట్టున్నవారే. పైగా ఆర్థికంగానూ బలంగా ఉండే వారిని ఎంపిక చేసుకున్నారు.

నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వీరంతా వైసీపీకి వీర విధేయులు. అయినా ఆ పార్టీని వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టిక్కెట్ ఇవ్వకపోయినా చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న తర్వాత షర్మిల టీం చర్చలు జరిపి వీరిని పోటీకి అంగీకరింప చేసింది. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి .. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ లో చేరి.. టెక్కలి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

ఇలా కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్ని నిలబెడుతోంది. అయితే వీరి బలం గెలవడానికి సరిపోదు. కానీ ఓడించడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఏ స్థానంలోనూ నోటాను మించి ఓట్లు రాలేదు. కానీ ఈ సారి షర్మిల ప్రభావం గట్టిగా కనిపించనుంది. కీలకమైన స్థానాల్లో పది నుంచి పదిహేను వేల ఓట్లు చీలిస్తే పోటీలో ఉన్న కొంత మంది అభ్యర్థుల జాతకాలు తారుమారు అవుతాయి. అంత బలం చూపించేవారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు.

1999 ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్లను చీల్చడానికి లోక్ సత్తా పోటీ చేసింది. రెండు శాతం ఓట్లు చీల్చింది. లోక్ సత్తా పోటీ చేయకపోతే వారు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలిచింది.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ లోక్ సత్తా కన్నా ఎక్కువగా నాలుగైదు శాతం ఓట్లు చీల్చబోతోంది. ఎవరికి నష్టమో ఎన్నికల ఫలితాలు తేల్చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close