ఒక సీన్ – 47 టేకులు… జ‌గ్గూభాయ్ స్వీట్ రివైంజ్‌

సెట్లో ద‌ర్శ‌కుడికీ, న‌టీన‌టుల‌కు మ‌ధ్య కెమిస్ట్రీ చాలా అవ‌స‌రం. డైరెక్ట‌ర్ ఏం చెబుతున్నాడ‌ది ఆర్టిస్టుల‌కు, ఆర్టిస్టుల‌తో పెర్‌ఫార్మెన్స్ ఎలా తీసుకురావాల‌న్న‌ది ద‌ర్శ‌కుల‌కు తెలియాల్సిందే. ఈ రెండింటో ఏది లేక‌పోయినా, మిస్ క‌మ్యునికేష‌న్ జ‌రుగుతుంది. దాంతో సెట్లో అంతా గంద‌ర‌గోళ‌మే. ఇలాంటి ఓ సంద‌ర్భ‌మే.. ‘ఫ్యామిలీస్టార్‌’ సినిమా సెట్లో ఎదురైంది.

ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు ఓ చిన్న‌ పాత్ర పోషించారు. ఆయ‌న క‌నిపించింది రెండు మూడు సీన్లే. అయితే ఓ సీన్ కోసం ఏకంగా 47 టేకులు తీసుకొన్నార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. జ‌గ‌ప‌తిబాబు పెద్ద‌గా టేకులు తినేసి, ఇబ్బంది పెట్టే న‌టుడు కాదు. మెథ‌డ్ యాక్టింగ్ అస్స‌లు తెలీదు. ఒక‌టి, రెండు టేకుల్లో సీన్ పూర్త‌యిపోతుంది. కానీ త‌న కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా 47 టేకులు తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే. అలాగ‌ని అదేదో.. అరివీర‌భ‌యంక‌ర‌మైన పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సీన్‌కాదు. చాలా మామూలు సీనే. అయినా ఇన్ని టేకులు ఎందుకు అవ‌స‌రం అయ్యాయి?

ఎందుకంటే.. ఇదంతా జ‌గ‌ప‌తి బాబు ద‌ర్శ‌కుడిపై తీర్చుకొన్న స్వీట్ రివైంజ్‌. సెట్లో సీన్‌కి సంబంధించిన ఏదో డౌట్ ఉంటే, ప‌ర‌శురామ్‌తో చ‌ర్చిస్తున్న‌ప్పుడు ఆయ‌నేదో వెట‌కారంగా మాట్లాడార‌ట‌. దాంతో.. జ‌గ్గూభాయ్‌కి కోపం వ‌చ్చింది. అదంతా.. టేకులు తినేస్తూ తీర్చేసుకొన్నారు. పావుగంట‌లో పూర్త‌వ్వాల్సిన షాట్… ఒక్క పూట‌కు గానీ పూర్త‌వ్వ‌లేదు. క‌క్క‌లేక మింగ‌లేక‌.. ప‌ర‌శురామ్ మోనేట‌ర్ ముందు కూర్చుని ‘వ‌న్ మోర్‌’ చెప్పుకొంటూ వెళ్లిపోయాడు. చివ‌రికి జ‌గ్గూభాయ్‌కే విసుగొచ్చి, ఆ సీన్ ప‌ర్‌ఫెక్ట్‌గా చేసేసి, త‌ప్పుకొన్నారు. సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో పెట్టుకొంటే, ఇలానే ఉంటుంది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close