పంతం నెగ్గించుకున్న పొంగులేటి… ఖ‌మ్మం సీటు ఆయ‌న‌కే!?

ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుండి ఒక్క‌రినీ కూడా అసెంబ్లీ గేటు తాక‌నివ్వ‌ను అంటూ స‌వాల్ విసిరి మ‌రీ పంతం నెగ్గించుకున్న నేత పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. పొంగులేటి చేరిక త‌ర్వాత కాంగ్రెస్ లో క‌నిపించిన జోష్ అంతా ఇంతా కాదు. అన్ని ర‌కాలుగా బ‌ల‌మైన నేత కావ‌టం కాంగ్రెస్ కు క‌లిసిరాగా, ఎంపీ ఎన్నిక‌ల్లో పెద్ద త‌ల‌నొప్పే తెచ్చిపెట్టింది.

కాంగ్రెస్ గెలుపు క‌న్ఫామ్ అనుకున్న సీట్ల‌లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న సీటు ఖ‌మ్మం. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు కూడా ఖ‌మ్మం గెలవ‌లేం అన్న‌ట్లుగా ఫిక్స్ అయిపోయిన త‌రుణంలో గెలిచే సీటు ఎవరికి అన్న పోటీ నెల‌కొంది. వీహెచ్ మొద‌లు చాలా మంది నేత‌లు ఖ‌మ్మం సీటు కోసం ప్ర‌య‌త్నించారు. ఈ లిస్టులో డిప్యూటీ సీఎం భ‌ట్టి భార్య‌, మంత్రి పొంగులేటి సోద‌రుడు, మంత్రి తుమ్మల కొడుకు ఉండ‌టంతో హాట్ టాపిక్ గా మారింది. అధినాయ‌క‌త్వం కూడా ఆ సీటుపై ఏటూ తేల్చ‌లేదు.

అయితే, ఏఐసీసీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… ఖ‌మ్మం సీటుపై మంత్రి పొంగులేటి త‌న పంతం నెగ్గించుకున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సోద‌రుడు ప్ర‌సాద్ రెడ్డికి టికెట్ క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం. ఇక మ‌రో పెండింగ్ సీటు క‌రీంన‌గ‌ర్ నుండి అంద‌రూ ఊహించిన‌ట్లుగానే వెలిచాల రాజేంద‌ర్ రావుకు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు సెగ్మెంట్ల‌తో పాటు హైద‌రాబాద్ సీటు కూడా పెండింగ్ లో ఉన్నాయి.

ఒక‌ట్రెండు రోజుల్లో ఈ మూడు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఏఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close