హైదరాబాద్‌లో డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సహజం… కానీ తెలంగాణ పోలీసులు ఇంకో అడుగు ముందుకేశారు. ఏకంగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయాలని నిర్ణియంచుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆ ప్రకారం గంజాయి ఎంత చిన్న మొత్తం కనిపించినా పట్టుకుంటున్నారు. ఇక వేరే డ్రగ్స్ కేసుల్లో అయితే వీఐపీలనూ వదలడం లేదు.

ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఇప్పుడు డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర పోలీస్‌ నిర్ణయించింది. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ‘ఎబోన్‌ యూరిన్‌ కప్‌’ యంత్రంతో పరీక్షలు జరపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఈ పరీక్షల కిట్‌ను సమకూర్చి.. అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపింది.

ఈ పరికరం సాయంతో డ్రగ్స్‌ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని ఠాణాల పరిధిలో తనిఖీలు మొదలయ్యాయి. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగించారనే అనుమానం వచ్చిన పక్షంలో ఈ కిట్‌ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తారు. పరికరంలో రెండు ఎర్ర గీతలు కన్పిస్తే ‘నెగెటివ్‌’గా, ఒకటే గీత కన్పిస్తే ‘పాజిటివ్‌’గా పరిగణిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close