‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల ‘పుష్ష 2’ గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే… మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం పెద్ద లోటు. టీజ‌ర్ కూడా హడావుడిగా క‌ట్ చేసిన‌ట్టు అనిపించింది. ఫోక‌స్ అంతా గంగ‌మ్మ జాత‌ర‌పైనే పెట్టారు. మిగిలిన క్యారెక్ట‌ర్ల‌ని ఏమాత్రం ప‌రిచ‌యం చేయ‌లేదు.

అయితే బ‌న్నీ బ‌ర్త్ డేకి 2 వెర్ష‌న్ల‌లో టీజ‌ర్ క‌ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌దాంట్లో గంగ‌మ్మ జాత‌ర‌ సెట‌ప్ ఉంటే, రెండోది మిగిలిన ఫుటేజ్‌తో క‌ట్ చేశారు. ఆ టీజ‌ర్‌లో పుష్ష వ‌ర‌ల్డ్ మొత్తం చూపించారు. అయితే.. బ‌న్నీ పుట్టిన రోజున‌, బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ని మాత్ర‌మే హైలెట్ చేయాల‌న్న ఉద్దేశంతో గంగ‌మ్మ జాత‌ర టీజ‌ర్ వ‌దిలారు. ఇప్పుడు రెండో టీజ‌ర్ కూడా రెడీగానే ఉంది. దాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. ‘పుష్ష 2’కి సంబంధించిన పాట‌ల‌న్నీ దాదాపు రెడీ అయిపోయాయి. ముందుగా ఓ పాట వ‌దిలి, ఆ త‌ర‌వాత సిద్ధంగా ఉన్న రెండో టీజ‌ర్‌ని చూపించాల‌నుకొంటుంది చిత్ర‌బృందం. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అంటే..నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంది. అందుకే… టీజ‌ర్ విడుద‌ల చేసే విష‌యంలో ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close