జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం ఐదుగురు ద‌ళితుల శిరోముండ‌నం కేసులో కోర్టు తీర్పు వెలువ‌రించింది.

హైకోర్టు సూచ‌న‌తో కేసును విచారించిన దిగువ కోర్టు… తోట త్రిమూర్తులు స‌హా మొత్తం 10మందిని దోషులుగా తేల్చింది. ఇందులో ఒక‌రు ఇప్ప‌టికే మ‌ర‌ణించారు.

తోట త్రిమూర్తులుకు ఒక సెక్ష‌న్ లో 18నెల‌ల జైలు శిక్ష‌తో పాటు ల‌క్షా యాబై వేల జ‌రిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది.

1996, డిసెంబ‌ర్ 26న వెంక‌టాయ‌పాలేంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎన్నిక‌ల క‌క్ష‌తో ఐదుగురు ద‌ళితుల‌కు శిరోముండ‌నం చేశార‌ని కేసు న‌మోదైంది. అయితే, 1998లో ఇది అక్ర‌మ కేసు అని ఆనాడు కేసు కొట్టివేయ‌గా, 2000 సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వం కేసును రీఓపెన్ చేసింది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 146సార్లు వాయిదా ప‌డుతూ కేసు విచార‌ణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు వెలువ‌రించింది.

అయితే, తోట త్రిమూర్తుల శిక్ష విష‌యంలో మీరేమైనా చెప్ప‌ద‌ల్చుకున్నారా అని న్యాయ‌మూర్తి అడ‌గ్గా… న‌న్ను రాజ‌కీయం దెబ్బ‌తీసేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. నేను ఇన్ని సంవ‌త్స‌రాలుగా ఎంతో మనోవేధ‌న‌ను అనుభ‌వించాన‌ని, 87 రోజుల పాటు రిమాండ్ లో కూడా ఉన్నాన‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

ఆ ఇద్దరు మంత్రులతో రేవంత్ కు గ్యాప్ పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం సచివాలయంలో వ్యవసాయ...

బీఆర్ఎస్ దీన స్థితికి ఇది మరో సాక్ష్యం !

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close