మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే… ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ సినిమా మొద‌లెట్టినా, ముందుగా ఓ ప్రెస్ మీట్ పెట్టి, సినిమా కాన్సెప్ట్ గురించి మీడియాకు చెప్ప‌డం జ‌క్క‌న్న ఆన‌వాయితీ. ఈసారీ అదే చేయ‌బోతున్నాడు. కానీ.. తొలిసారి జ‌క్క‌న్న సినిమా కోసం ఓ కాన్సెప్ట్ వీడియో కూడా రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. క‌థ గురించి, క్యారెక్ట‌ర్ల గురించి చూచాయిగా ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించ‌బోతున్నాడ‌ట రాజ‌మౌళి. అందుకు సంబంధించిన క్రియేటీవ్ వ‌ర్క్ కూడా మొద‌లైంద‌ని స‌మాచారం. మ‌హేష్ మిన‌హాయిస్తే మిగిలిన కాస్టింగ్ ఎవరూ ఫైన‌లైజ్ కాలేదు. ప్ర‌తినాయకుడి పాత్ర కోసం హాలీవుడ్ స్టార్‌ని రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. క‌థానాయిక‌ల ఎంపిక కూడా క్లిష్ట‌మైన ప్ర‌క్రియే. ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చిన త‌ర‌వాతే.. రాజ‌మౌళి మీడియా ముందుకు వ‌స్తార‌ని స‌మాచారం. మ‌హేష్ లుక్ టెస్ట్ కోసం రాజ‌మౌళి దాదాపు నెల రోజులు కేటాయించార‌ని తెలుస్తోంది. అందుకోసం మేక‌ప్ నిపుణుల‌తో ప్ర‌త్యేక‌మైన స్కెచ్‌లు రూపొందించార్ట‌. మ‌హేష్ కూడా పాత్ర‌కు అనుగుణంగా త‌న ఫిజిక్ మార్చుకొనే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close