ప్ర‌భాస్ – నిధి… ఓ డ్యూయెట్‌!

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ‘రాజాసాబ్‌’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్ లో శ‌ర వేగంగా సాగుతోంది. ప్ర‌స్తుతం సంజ‌య్‌ద‌త్ పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. మంగ‌ళ‌వారం నుంచి క‌థానాయిక నిధి అగ‌ర్వాల్ కూడా సెట్లో అడుడు పెట్టింది. త‌ను కూడా షూటింగ్ లో పాలు పంచుకొంటోంది. ఇక ప్ర‌భాస్ రావ‌డ‌మే త‌రువాయి.

ఈవారంలోనే ‘రాజాసాబ్‌’ సెట్లో ప్ర‌భాస్ ఎంట్రీ ఉండ‌బోతోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భాస్‌, నిధి, సంజ‌య్‌ద‌త్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఆ త‌ర‌వాత ప్ర‌భాస్‌, నిధిల‌పై ఓ డ్యూయెట్ కూడా తెర‌కెక్కిస్తారు. ప్ర‌భాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అందుకే ‘రాజాసాబ్‌’కి స‌రైన స్థాయిలో కాల్షీట్లు కేటాయించ‌లేక‌పోతున్నాడు. ‘క‌ల్కి’ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసిన నేప‌థ్యంలో ఇప్పుడు పూర్తి ఫోక‌స్‌ని ‘రాజా సాబ్‌’పై షిఫ్ట్ చేశాడు. ఇపై త్వ‌రిత‌గ‌తిన ‘రాజాసాబ్‌’ పూర్తి చేయాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close