మోడీ వర్సెస్ నితిన్ గడ్కరీ … బీజేపీలో ముసలం..?

నాగ్ పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నితిన్ గడ్కరీ సొంతంగా మేనిఫెస్టోను ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజులకే ఆయన సొంతంగా మేనిఫెస్టోను విడుదల పలు సందేహాలకు కారణం అవుతోంది. వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలతోపాటు అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో నాగ్ పూర్ ను అగ్రస్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు గడ్కరీ.

ఉద్యోగాల భర్తీపై మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ సర్కార్ పై ఇప్పటికే పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ సొంతంగా ప్రకటించిన మేనిఫెస్టోలో లక్ష ఉద్యోగాలు అనే హామీ… ఉద్యోగాల విషయంలో మోడీపై నమ్మకం లేకే ఆయన నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు ఈ హామీ ఇచ్చారా.? అనే ప్రచారం జరుగుతోంది.

సొంతంగా మేనిఫెస్టో ప్రకటించడం నిషేధం కాదు కానీ, నితిన్ గడ్కరీ ప్రకటించడం పలు సందేహాలకు కారణం అవుతోంది. మోడీ – నితిన్ గడ్కరీ మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మోడీ తర్వాత నితిన్ గడ్కరీ అని ఆర్ఎస్ఎస్ ఆయన పేరును ప్రతిపాదిస్తే మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారని ప్రచారం ఉన్నది. గడ్కరీకి చెక్ పెట్టేందుకే యోగిని మోడీ ఎంకరేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో ఉండగా… నితిన్ గడ్కరీ సొంతంగా మేనిఫెస్టోను విడుదల చేయడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close