చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థ‌, ప‌క్కింటి అబ్బాయి లాంటి పాత్ర‌లు సుహాస్‌ని వెదుక్కొంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు సుహాస్ చేతిలో ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలున్నాయి. అవ‌న్నీ ఓకే చేసిన క‌థ‌లే! సుహాస్ ఇప్పుడు క‌థ విన్నా, అది న‌చ్చినా, రెండేళ్ల వ‌ర‌కూ షూటింగ్ కి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉందంటే, సుహాస్ స్పీడు ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు.

రూ.5 నుంచి రూ.6 కోట్ల లోపు పూర్త‌య్యే సినిమాల‌కు సుహాస్ ఇప్పుడు ఓ మంచి ఆప్ష‌న్‌గా మిగిలాడు. సుహాస్ గ‌త సినిమాలు బాగా ఆడ‌డం, ఓటీటీలో త‌న‌కంటూ ఓ మార్కెట్ ఉండ‌డం వ‌ల్ల‌, పెట్టుబ‌డి ఎలాగైనా తిరిగి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం నిర్మాత‌ల‌కు క‌లుగుతుతోంది. దాంతో.. సుహాస్‌ని వెదుక్కొంటూ వెళ్తున్నారు. సుహాస్ కూడా త‌న పెట్టుబ‌డిని క్ర‌మంగా పెంచుకొంటూ వెళ్తున్నాడు. త‌న తొలి సినిమా ‘క‌ల‌ర్ ఫొటో’కి నామ మాత్ర‌పు రెమ్యున‌రేష‌న్ తీసుకొన్న సుహాస్ ప్ర‌స్తుతం రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వ‌ర‌కూ డిమాండ్ చేస్తున్నాడు. అడిగినంత ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీగా ఉన్నా, సుహాస్ ద‌గ్గ‌ర మాత్రం డేట్లు లేవు. అన్న‌ట్టు.. త‌ను న‌టించిన ‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఫేస్‌ బ్లైండ్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకొన్న సినిమా ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు ప్రమాణస్వీకారం – LIVE UPDATES

చంద్రబాబు ప్రమాణస్వీకార లైవ్ అప్డేట్స్ కోసం పేజీని ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేయండి సభా వేదిక వద్దకు చేరుకున్న నారా భువనేశ్వరి మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్న చంద్రబాబు ప్రమాణస్వీకారం ...

ధూళిపాళ్లకు ఈ సారీ త్యాగమే !

దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి వరుసగా గెలుస్తూ వస్తున్నా మంత్రి పదవి ముఖం చూడలేకపోయిన కొంత మంది టీడీపీ నేతలకూ ఈ సారి కూడా నిరాశే ఎదురయింది. మంత్రి పదవులు చేపట్టని టీడీపీ...

కేబినెట్ కూర్పులో లోకేష్ మార్క్…?

సీనియర్లు, జూనియర్ల కలయికతో చంద్రబాబు కేబినెట్ ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ మంత్రివర్గంలో చాలామంది సీనియర్లను పక్కన పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. గంటా శ్రీనివాస్, అయ్యన్న , పరిటాల సునీతతోపాటు...

కూటమి ప్రభుత్వంపై ఏపీ పునర్నిర్మాణ బాధ్యత !

ఆంధ్రప్రదేశ్‌లో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. సాధారణంగా ప్రభుత్వాలు మారేటప్పుడు ఉత్సాహం ఉంటుంది. అధికారం తమ చేతుల్లోకి వస్తుందని ఆయా పార్టీల నేతలు సంతృప్తిగా ఉంటారు. కానీ ఏపీలో అధికారం చేపట్టే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close