కుర్ర‌హీరోకి వంశీ ఝ‌ల‌క్‌

ఒక‌ట్రెండు హిట్లొస్తే చాలు కాల‌ర్ ఎగ‌రేస్తుంటారు కుర్ర‌హీరోలు. ‘ప‌రిశ్ర‌మ అంతా నాతోనే’ అనే భ్ర‌మ‌ల్లో బ‌తికేస్తుంటారు. పారితోషికాలు పెంచేయ‌డాలూ, సెట్లో అజ‌మాయిషీ చేసేయ‌డాలూ… మామూలే! ఫ‌లానా హీరోయ‌న్‌ని తీసుకొంటారా, లేదా?? అంటూ డిమాండింగులూ గ‌ట్రా చేసేస్తుంటారు. రాజ్ త‌రుణ్ కూడా ఆ బాబ‌తే. వ‌రుస‌గా మూడు హిట్లు కొట్టాడు క‌దా..?? అందుకే త‌న బ‌లుపు చూపించ‌డం మొద‌లెట్టాడు. సెట్లో రాజ్ త‌రుణ్ వ్య‌వ‌హారం ఏమంత బాగోద‌ని, త‌రుణ్‌తో చేస్తున్న నిర్మాత‌లు వాపోతుంటారు. ఈ బ‌లుపే.. ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర చూపించాల‌నుకొని అడ్డంగా బుక్క‌య్యాడు రాజ్ త‌రుణ్‌.. ఆ వివ‌రాల్లోకి వెళ్తే…

గోదారి అందాల్ని, ప‌ల్లెటూరి క‌థ‌ల్ని వెండి తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే ద‌ర్శ‌కుడు వంశీ. లేడీస్ టైల‌ర్‌కి సీక్వెల్‌గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఈ క‌థ ర‌వితేజ కోస‌మే రాసుకొన్నా… ఆయ‌న‌గారు క‌రుణించ‌లేదు. అందుకే జూ.ర‌వితేజ‌లాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న రాజ్ త‌రుణ్‌కి ఈ క‌థ వినిపించారు. వంశీతో సినిమా చేయ‌డమే అదృష్టం అని ముందు పొంగిపోయినా.. ఆ త‌ర‌వాత త‌న ఖాతాలో ప‌డుతున్న హిట్లు గుర్తొచ్చిన రాజ్ త‌రుణ్‌…త‌న ఎట‌కారం చూపించ‌డం మొద‌లెట్టాడు. ‘అది బాలేదు.. ఇది బాలేదు’ అంటూ స్ర్కిప్టులో కాళ్లూ, వేళ్లే పెట్టి కెలికేయ‌డం స్టార్ట్ చేశాడ‌ట‌. దాంతో వంశీకి తిక్క రేగింది. ‘నువ్వొద్దులే అబ్బాయ్.. ఇంకొక‌ర్ని చూసుకొంటా’ అంటూ మొహం మీదే చెప్పేసి.. మ‌రో కుర్ర హీరోతో వంశీ క‌మిట్ అయిపోయాడ‌ని టాక్‌. వంశీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకొంటాడ‌ని తెలీని రాజ్ త‌రుణ్‌.. ఇప్పుడు అయ్యో.. అంటున్నాడ‌ట‌. సీనియ‌ర్ల ముందే తొక జాడిస్తే ఫ‌లితం ఇలానే ఉంటుంది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close