స‌రైనోడు.. ఎన్టీఆర్ కోస‌మా?

అల్లు అర్జున్ ‘స‌రైనోడు’గా… సిద్ధ‌మ‌వుతున్నాడు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే.. స‌రైనోడుకి సంబంధించి ఓ హాటెస్ట్ న్యూస్ ఒక‌టి బ‌యట‌కు వ‌చ్చింది. నిజానికి ఇది అల్లు అర్జున్ కోసం రాసుకొన్న క‌థ కాద‌ట‌. గోపీచంద్ కోసం సిద్ధ‌మైంద‌ట‌. ఆ త‌ర‌వాత‌.. ఎన్టీఆర్‌కీ వినిపించార‌ట‌. వాళ్లిద్ద‌రూ నో చెప్ప‌డంతో బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగిన‌ట్టు తెలుస్తోంది.

బోయ‌పాటి – ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో ద‌మ్ము అనే సినిమా వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్‌కి బోయ‌పాటి వినిపించిన క‌థ‌.. ఇదే. క‌థ‌లో కొన్ని లోటు పాట్లు ఉండ‌డంతో ఎన్టీఆర్ ‘నో’ చెప్పాడ‌ట‌. ఆ త‌ర‌వాత ద‌మ్ము స్ర్కిప్ట్ ప‌ట్టాలెక్కింది. తుల‌సి త‌ర‌వాత గోపీచంద్‌తో ఓ సినిమా చేద్దామ‌ని ప్లాన్ చేశాడు బోయ‌పాటి. ఈ కాంబినేష‌న్ దాదాపుగా ఓకే అయిపోయింది కూడా. కానీ… క‌థ న‌చ్చ‌క గోపీచంద్ డ్రాప్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ క‌థని బ‌న్నీ స్టైల్‌కి త‌గిన‌ట్టుగా బోయ‌పాటి మార్చాడ‌ట‌. ఇద్ద‌రు హీరోలు నో అన్న క‌థ‌ని బ‌న్నీ ఎలా ఒప్పుకొన్నాడో..?? అని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఫీల‌వుతున్నారు. సినిమా హిట్ట‌యితే ఇవ‌న్నీ మ‌ర్చిపోతారు లెండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close