సింగపూర్, జపాన్ తరువాత ఇప్పుడు లండన్ వంతా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ఓ డజను మందిని వెంటేసుకొని మూడు రోజుల లండన్ పర్యటనకి వెళ్ళారు. అక్కడ జె.సి.బి.,రోల్స్-రాయిస్, మేస్ అండ్ మెక్ డోనాల్డ్, కటపల్ట్, హెర్బర్ట్ స్మిత్ ఫ్రీ హిల్స్, యూ.కె. ఎక్స్ పోర్ట్ ఫైనాన్స్, ఏ.ఆర్.ఎం, వోడాఫోన్ తదితర పెద్ద సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు బృందం సమావేశమయ్యింది. అలాగే లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ సి.ఈ.ఓ. నిఖిల్ రతితో కూడా సమావేశమయ్యారు. వారికి ఏపిలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న అమరావతి గురించి వారికి వివరించి రాష్ట్రంలో, అమరావతిలో పెట్టుబడులు పెట్టమని కోరారు. అలాగే అమరావతి నిర్మాణానికి కూడా సహాయం చేయాలని కోరారు. ఆ సంస్థలు కూడా చాలా సానుకూలంగా స్పందించాయని వార్తలు వస్తున్నాయి.

ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు పెద్ద బృందాన్ని వెంటేసుకొని సింగపూర్, జపాన్, చైనా దేశాలకు వెళ్ళినప్పుడు ఇలాగే వార్తలు వచ్చేయి. ఆ తరువాత ఆయన కుమారుడు నారా లోకేష్ అమెరికా వెళ్లి ఒబామాతో, అక్కడి పారిశ్రామిక వేత్తలతో ఫోటోలు దిగివచ్చినప్పుడు “ఇంకేముంది చిన్నబాబు తన పలుకుబడిని ఉపయోగించేసారని..ఇంక రాష్ట్రానికి పెట్టుబడుల వరదల్లా ముంచెత్తబోతున్నాయని వార్తలు చూసాము. ఆ మధ్యన వైజాగ్ లో రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా సి.ఐ.ఐ. సభలు జరిపించినపుడు కూడా లక్షల కోట్లకి ఒప్పందాలు జరిగిపోయాయని, ఇంక చూసుకోనవసరం లేదనట్లు అందరూ మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అన్నట్లుగా అన్ని పర్యటనలు, సమావేశాలు విజయవంతం అయిపోతున్నా రాష్ట్రానికి ‘కాణీ’ పెట్టుబడి రాలేదు.

మన రాష్ట్రం 10.97 శాతం అభివృద్ధి నమోదు చేసిందిట. జాతీయ స్థాయి కంటే సుమారు ఐదు శాతం ఎక్కువట. రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి చెందిపోతున్నా ఇంకా చంద్రబాబు నాయుడు లండన్ వెళ్లి రాజధానిలో మౌలికవసతుల కల్పన కోసం, రాజధాని నిర్మాణం, పరిశ్రమలు, పెట్టుబడుల కోసం అందరినీ ఎందుకు బ్రతిమాలుకోవలసి వస్తోంది?

అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించబోతున్నామని చెప్పి మళ్ళీ దానికి వారినే పెట్టుబడి పెట్టమని అడగడం ఎలాగుంది అంటే “నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తాను’ అన్నట్లుంది. మన చేతిలో డబ్బు లేనప్పుడు నలుగురి సహాయం ఆశించడం సహజమే కానీ అప్పుడు మన ఆలోచనలు, కోరికలకి కూడా ఒక పరిమితి ఉండాలి. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించమని రాష్ట్ర ప్రజలు ఎవరూ చంద్రబాబు నాయుడిని ఒత్తిడి చేయలేదు. ఆయనకు ఆయనే అలాగ ఫిక్స్ అయిపోయి ముందుకు సాగిపోతున్నారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం 25,000 కోట్లు మంజూరు చేయడానికి అంగీకరించింది. దుబారా ఖర్చులు తగ్గించుకొంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాదికి ఓ ఐదో పదో వేల కోట్లు దీనికి కేటాయించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక చేతిలో ఉన్న డబ్బుతో రాజధాని నిర్మాణం చేసుకోవడం మొదలుపెడితే ఈపాటికి రాజధానిలో కొన్ని భవనాలు కనపడి ఉండేవి. అప్పుడు పెట్టుబడులు వాటంతట అవే వచ్చేవి. ఒకవేళ పెట్టుబడులు రాకపోయినా మన ఆర్ధికశక్తి మేరకు రాజధానిని అంచెలంచెలుగా నిర్మించుకొంటే ఎవరూ మనల్ని నిలదీయరు.

మిగిలిన మూడేళ్ళు కూడా సింగపూర్ సంస్థలు గీసిచ్చిన రాజధాని బొమ్మలను పట్టుకొని ప్రపంచంమంతా తిరుగుతూ, ఒకేసారి లండన్, సింగపూర్, ప్యారిస్ వంటి అత్యాధునిక నగరాన్ని నిర్మించేద్దామనుకొంటే చివరికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయి వృధా ప్రయాస మిగులుతుంది. కనుక ఇంకా ఆలశ్యం చేయకుండా కేంద్రం, దేశీయ సంస్థల సహకారంతో, దేశంలో విరివిగా లభించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొంటూ అత్యంత ప్రతిభావంతులయిన మన స్వంత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులతో రాజధాని నిర్మాణం మొదలుపెడితే మంచిది. అదే మన అందరికీ గౌరవప్రదంగా ఉంటుంది కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close