క్యాష్ చేసుకోలేక‌పోయిన క‌ల్యాణం

ఈరోజుల్లో హిట్ టాక్ రావ‌డ‌మే గ‌గ‌నం అయిపోయింది. యావ‌రేజ్ అని ప్రేక్ష‌కులు తీర్పు ఇచ్చినా… దాన్ని హిట్ చేసుకోవ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆప‌సోపాలు ప‌డిపోతుంటారు. సినిమాకి అలాంటిది హిట్ టాక్ వ‌చ్చినా.. క్యాష్ చేసుకోక‌పోవ‌డం చేత‌కాని త‌న‌మే. నాగ‌శౌర్య – నందిని రెడ్డిల సినిమా క‌ల్యాణ వైభోగ‌మే.. ఈ లిస్టులో చేరుతుంది. జ‌బ‌ర్‌ద‌స్త్ లాంటి గ‌ట్టి దెబ్బ తిన్న త‌ర‌వాత‌.. రెండేళ్లు విరామం తీసుకొని నందిని చేసిన ప్ర‌య‌త్నం క‌ల్యాణ వైభోగ‌మే. గ‌త వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క్లాస్ ట‌చ్ ఉంది, ఫ్యామిలీ సినిమా అని తొలిషోకే అంద‌రూ కితాబులు ఇచ్చారు. రేటింగ్స్ కూడా బాగానే అందాయి, కానీ ఓవ‌రాల్ వ‌సూళ్లు మాత్రం చిత్ర‌బృందానికి సంతృప్తి క‌లిగించ‌డం లేదు.

సాధార‌ణంగా ఇంత పాజిటీవ్ టాక్ వ‌చ్చిన ఏ సినిమా అయినా.. తొలి వారంలో క‌నీసం రూ.5 కోట్ల‌యినా వ‌సూళ్లు రాబ‌ట్టుకొంటుంది.కానీ క‌ల్యాణ వైభోగ‌మే మాత్రం రూ.3 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోయింది. సినిమా హిట్ట‌యిన త‌ర‌వాత చిత్ర‌బృందం కేవ‌లం మౌత్ టాక్‌పైనే ఆధార‌ప‌డ‌డం, ప‌బ్లిసిటీ పెంచే ఆలోచ‌న‌లేం చేయ‌క‌పోవ‌డంతో.. వ‌సూళ్ల‌కు గండి ప‌డింది. హిట్ అయిన త‌ర‌వాత థియేట‌ర్లు పెంచుకొంటే మంచి ప‌లితం ఉండేది. కానీ.. ఆ దిశ‌గా నిర్మాత‌లేం చొర‌వ చూపించ‌లేదు. ఓవ‌రాల్‌గా చూస్తే… క‌ల్యాణ వైభోగ‌మే సినిమాకి లాభాలు ద‌క్కి ఉండొచ్చు. కానీ.. రావ‌ల్సిన క్రెడిట్ మాత్రం రాలేదు. ఇది మాత్రం నిరాశ ప‌రిచే విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close