ప‌వన్ ఇంట‌ర్వ్యూ ఫ్లాప్ అయ్యిందా??

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడోగానీ మీడియా ముందుకు రాడు. ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు అతి తక్కువ‌. మైకు ఇచ్చినా మాట్లాడ‌డు. న‌లుగురి ముందూ సిగ్గుప‌డిపోతుంటాడు. అందుకే ప‌వ‌న్ ఎప్పుడు ఇంట‌ర్వ్యూ ఇచ్చినా అదో సంచ‌ల‌నం అవుతుంది. ఏం మాట్లాడినా అభిమానుల‌కు అపురూపంగా క‌నిపిస్తుంది. అనుప‌మ చోప్రాకి ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూ ఇస్తాడు అన‌గానే, అందులో ఏముంటుందా? అని ఆస‌క్తి క‌న‌బ‌రిచారు నెటిజ‌న్లు.విష‌యం ఏదైన స‌రే, కుండ బ‌ద్ద‌లు కొట్టినట్టు మాట్లాడే ప‌వ‌న్ నోటి నుంచి సంచ‌ల‌నాలు వ‌స్తాయ‌ని ఆశించారు. ఆ ఇంట‌ర్వ్యూ నెట్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని లెక్క‌లేశారు. కానీ… అంకెలు చూస్తే ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూ ఫ్లాప్ అయ్యిందేమో అన్న అనుమానాలు వ‌స్తున్నాయి.

ప‌వ‌న్ నుంచి ఓ టీజ‌ర్ వ‌స్తేనో, మేకింగ్ వీడియో వ‌స్తేనో యూ ట్యూబ్‌లో హిట్స్ అదిరిపోతాయి. ఒక్క రోజులోనే ప‌ది ల‌క్ష‌ల హిట్స్ వ‌చ్చిపడిపోతాయి. కానీ ఇంట‌ర్వ్యూకి మాత్రం అలాంటి స్పంద‌న లేదు. మూడు పార్టులుగా ఇంట‌ర్వ్యూ విభ‌జించ‌డం చాలా పెద్ద దెబ్బ‌కొట్టింది. మూడూ క‌లిపితే 4 ల‌క్ష‌ల‌ వ్యూస్ కూడా రాలేదు. దానికి తోడు `త్వ‌ర‌లో సినిమాలు మానేస్తా` అన్న పాయింట్ త‌ప్ప సంచ‌ల‌న విష‌యాలేం లేవు. ఇంట‌ర్వ్యూ ఆసాంతం ఇంగ్లీష్‌లోనే సాగ‌డం మ‌రో పెద్ద దెబ్బ‌. ప‌వ‌న్ మాట‌లు కూడా చాలామందికి అర్థం కాలేద‌నే చెప్పాలి. మొత్తానికి భారీ ఆర్భాటం గా మొద‌లై.. ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూ చ‌ప్ప‌గా ముగిసిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close